క్రీడాభూమి

రష్యా చేరుకున్న డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 12: ఫిఫా వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ మరోసారి సాకర్‌లో సత్తా చాటేందుకు, తద్వారా మళ్లీ మరోసారి చాంపియన్‌గా అవతరించేందుకు మంగళవారం రష్యా చేరుకుంది. కెప్టెన్ మాన్యుయెల్ న్యూయెర్‌తో కలసి వచ్చిన టీమ్‌కు ఇక్కడి రష్యావాసులు ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లంతా 26 సెట్ల జెర్సీలతోపాటు 12 టన్నుల వస్తు సామాగ్రితో చేరుకున్నారు.
కోచ్ జొయాచిమ్ లోరుూవ్ మాట్లాడుతూ తమ ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లంతా అప్పుడే ఇక్కడకు చేరుకున్నారని అన్నాడు. వారంతా తమకు గట్టి పోటీ ఇవ్వగలరనే ఆశిస్తున్నామన్నాడు. స్పెయిన్ బాగా పరిణితి చెందిందని, బ్రెజిల్, అర్జెంటీనా వారి సామర్థ్యం కూడా మెరుగుపడిందని అన్నాడు. అయితే, అందరి దృష్టి ఆదివారం జర్మనీ తలపడే మెక్సికో మ్యాచ్‌పై ఉంటుందన్నాడు.