క్రీడాభూమి

ఆసియా కప్ విజేతకు నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాక, జూన్ 12: ఆసియాకప్ మహిళల టీ-20 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన బంగ్లాదేశ్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. ఆరుసార్లు వరుస విజేతగా నిలిచిన భారత జట్టుతో కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు గెలుపెవరిదో అన్నట్టు కొనసాగింది. అఖరి బంతికి గెలిచిన బంగ్లాదేశ్ భారత జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. కౌలాలంపుర్ నుంచి స్వదేశానికి చేరుకున్న బంగ్లా మహిళల జట్టుకు 2,36,000 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1.59 కోట్ల నజరానాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఇందులో ఒక్కొక్క క్రీడాకారిణికి 14,800 డాలర్లు, జట్టు మేనేజిమెంట్, కోచింగ్ సిబ్బందికి కలిపి 75,000 డాలర్లు ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపాడు. ప్రస్తుతం మహిళా క్రికెటర్లకు ఉన్న జీతాలు, మ్యాచ్ ఫీజులపై సమీక్ష నిర్వహించి క్రమంగా పెంచే ప్రతిపాదన ఉందని, ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు.