క్రీడాభూమి

సాయ్‌ల పనితీరుపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలోని అన్ని ప్రాంతీయ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రాల పనితీరుపై సమీక్షలతో పాటు క్రీడాకారులకు ఇస్తున్న ఆహార, వసతి వంటి ఇతర విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరులోని సాయ్ కేంద్రంలో ఆహార, పరిశుభ్రత వంటి అనేక అంశాలపై ఆందోళన చెందాల్సి వచ్చిందని జాతీయ హాకీ చీఫ్ కోచ్ హారేంద్ర సింగ్ ఆందోళన చెంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన శాయ్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ ప్రాంతీయ కేంద్రాలపై తక్షణమే తనిఖీలు, సమీక్షలు నిర్వహించి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు స్వచ్ఛమైన పరిశుభ్రమైన వాతావరణంలో వారికి నాణ్యత కలిగిన ఆహారాన్ని అందిస్తామని స్పష్టం చేశాడు. బెంగళూరు సాయ్ కేంద్రంలో నూతన కుక్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపాడు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పర్యటించినపుడు ఈ సమస్యను అతని దృష్టికి తీసుకెళ్లామని కోచ్ పేర్కొన్నాడు. ఆహార సరఫరా నాణ్యత, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వంటి అంశాలపై ప్రభుత్వ పరంగా ప్రత్యేక దృష్టి సారించామని, ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని సాయ్ ప్రాంతీయ కేంద్రాల అధికారులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి పలు చర్యలు తీసుకోనున్నట్లు సాయ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించాడు. ప్రాంతీయ డైరెక్టర్లు ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలపై బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు. సాయ్ కేంద్రాల్లో ఎలాంటి అవకతవకాలు జరిగినా సహించేది లేదని, ఆహారం, పరిశుభ్రత తదితర అంశాలపై ఏమాత్రం ఫిర్యాదులు అందిన ప్రాంతీయ డైరెక్టర్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నాడు. ఇండియన్ ఒలింపిక్ సంఘం, ఇంటర్నేషనల్ హాకీ సమాఖ్య చీఫ్ నరీందర్ బత్రా బెంగళూరు సాయ్ కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. నెదర్లాండ్స్‌లోని బ్రెడాలో ఈనెల 23 నుంచి జూలై 1వరకు జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం కర్నాటకలోని బెంగళూరు సాయ్ కేంద్రంలో భారత జట్టు శిక్షణ పొందుతోంది.