క్రీడాభూమి

సాకర్‌పై చేవ సన్నగిల్లిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియోడిజనెరియో, జూన్ 12: ఫుట్‌బాల్ అంటే ఎంతో అభిమానించే బ్రెజిల్‌వాసుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందట. రష్యాలో ఈనెల 14 నుంచి వచ్చేనెల 15వ తేదీవరకు జరిగే క్రీడాసంబరంపై బ్రెజిల్‌లోని సగానికి పైగా జనాలకు ఇష్టం లేదని జరిగిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. ఫుట్‌బాల్ చరిత్రలో బ్రెజిల్‌కు ప్రపంచంలోనే ఘనమైన చరిత్ర ఉంది. అయితే, డేటాఫోల్హా పల్ నిర్వహించిన ఈ ఒపీనియన్ పోల్‌లో 53 శాతానికి పైగా ప్రజలు ఫుట్‌బాల్‌పై అయిష్టత వ్యక్తం చేశారట. ఈ ఏడాది జనవరి వరకు కేవలం 42 శాతం మంది ప్రజలకు ఫుట్‌బాల్‌పై మోజు క్రమేణా తగ్గుతోందని ఒపీనియన్ పోల్‌లో తేలింది.
దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, అవినీతి, కుంభకోణాలు, ట్రక్కుల సమ్మె వంటి అంశాలపై వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఫుట్‌బాల్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదని ఆ ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది. కాగా, బ్రెజిల్ తన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆదివారంనాడు స్విట్జర్లాండ్‌తో తలపడుతుంది. బ్రెజిల్ ఇప్పటివరకు ఐదుసార్లు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.