క్రీడాభూమి

బిసిసిఐకి రూ. 1,000 కోట్లు నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 19: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తీసుకున్న నిర్ణయం కారణంగా బోర్డుకు సుమారు 1,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నదని, కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి వచ్చే ఆదాయంలో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు అధిక భాగం వాటా లభిస్తున్నది. మొత్తం ఆదాయంలో బిసిసిఐ వాటా 27 శాతం. అయితే, ఆరు శాతం మొత్తాన్ని వదులుకుంటామని ఐసిసి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న మనోహర్ ఇది వరకే ప్రకటించాడు. దీని వల్ల కనీసం 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని సిబిజై మాజీ డైరెక్టర్ ఆర్‌కె రాఘవన్ తదితరులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్లు పేర్కొన్న అంశాలను అంశాలను చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ వైద్యనాథన్‌తో కూడిన మద్రాస్ హైకోర్టు బెంచ్ పరిశీలించింది. అయితే ఇప్పటికే ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం అందిందని, కాబట్టి పిల్‌ను కొనసాగిస్తారా లేక ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించింది. తమ క్లయింట్ నుంచి సమాచారం అందిన తర్వాతే వివరాలు ఇవ్వగలనని రాఘవన్ తరఫు న్యాయవాది చెప్పడంతో కేసును బుధవారానికి వాయిదా వేసింది.