క్రీడాభూమి

బ్లాకులో టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 14: రష్యాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ బ్లాక్ మార్కెటీర్లకు ఒక వరంలా మారింది. కొందరు వ్యక్తులు మాస్కోలోని టికెట్ల విక్రయ కేంద్రం మెయిన్ గేట్ వద్ద పలువురు వ్యక్తులు గుమికూడి విదేశాల నుంచి వచ్చే ఫుట్‌బాల్ అభిమానుల వద్దనున్న టికెట్లను కొనుగోలు చేస్తూ ఇతరులకు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం రష్యా-సౌదీ అరేబియా జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్ సందర్భంగా ఒక అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ వద్దకు కొందరు వ్యక్తులు వచ్చిన గంట సమయంలో ఆరుసార్లు టికెట్లు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఇందులో లగ్జరీ కేటగిరి-1 సీట్ కూడా ఉండడం గమనార్హం. ఒక విక్రయదారు ఒక టికెట్‌ను 700 డాలర్లు లేదా 150 డాలర్ల కంటే ఎక్కువ ఇస్తే టికెట్ ఇస్తానని పలువురిని ఆశపెట్టడం కనిపించింది. టోర్నీ ప్రారంభం రోజు బ్లాక్‌మార్కెట్ టికెట్ల ధర మామాలుగా ఉన్నా అర్జెంటీనా ఆడే తొలి మ్యాచ్‌లో మాత్రం మరింత ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మామూలుగా అయితే, అర్జెంటీనా ఆడే మ్యాచ్‌కు బ్లాక్‌మార్కెటీర్లు ఆన్‌లైన్‌లో ఆఫర్ చేసే ధర 2,300 డాలర్లు పలుకుతున్నా కొనుగోలుదారులు వాస్తవ టికెట్లను తీసుకుంటున్నారా లేదా అన్నదానికి మాత్రం గ్యారెంటీ ఏమీ లేదు. టికెట్ల బ్లాక్‌మార్కెట్ అంశాన్ని గుర్తించి ఫిఫా అధికారులు రంగంలోకి గత వారం కొన్ని టికెట్లను రద్దు చేయడమే కాకుండా టికెట్లను రీసేల్‌కు పెట్టిన వయాగోగో అనే వెబ్‌సైట్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా టికెట్లను బ్లాక్‌మార్కెట్ చేసిన వ్యక్తికి ఒక్కో టికెట్ ఎంత ధర పలుకుతుందో అంతకు 25 సార్లు అపరాధ రుసుం చెల్లించాలని కూడా ఫిఫి అధికారులు నిర్ణయించారు. పోలీసులు సైతం టికెట్ల విక్రయ కేంద్రాల వద్ద మోహరిస్తున్నా బ్లాక్‌మార్కెటీర్లు ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదు.