క్రీడాభూమి

నైక్ బూట్లు లేకుంటేనేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 14: వరల్డ్ కప్ క్రికెట్‌లో ఇరాన్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఒప్పందం కుదుర్చుకున్న నైక్ సంస్థ ఆ జట్టు ఆటగాళ్లకు బూట్లుసహా కిట్‌ను అందించడం లేదని చివరి క్షణంలో ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు నైక్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, ఊహించని విధంగా నైట్ సంస్థ ద్వారా ఎదురైన సమస్యను అధిగమించేందుకు ఇరాన్ చీఫ్ కోచ్ కార్లొస్ క్విరోజ్ సిద్ధమవుతున్నాడు. కిట్స్‌ను సరఫరా చేయడం లేదని చివరి క్షణాల్లో ప్రకటించడం ఇరాన్ సాకర్ జట్టును అవమానించినట్టేనని, దీనికి ఆ సంస్థ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అదే సమయంలో, నైట్ బూట్లు లేకున్నా వచ్చే నష్టం ఏమీ లేదని ఇరాన్ ఆటగాళ్లకు చెప్పాడు. ఈ విషయాన్ని ఆలోచించకుండా, శుక్రవారం మోరాకో జరిగే మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని ప్రాక్టీస్ సెషన్‌లో క్రీడాకారులకు సూచించాడు. ‘బూట్లు లేకుంటేనేం.. ఆత్మవిశ్వాసం ఉంది’ అని వ్యాఖ్యానించాడు.

చిత్రం..ఆటగాళ్లతో ఇరాన్ చీఫ్ కోచ్ కార్లొస్ క్విరోజ్