క్రీడాభూమి

రష్యా చేతిలో సౌదీ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 14: వరల్డ్ కప్ సాకర్‌కు ఆతిధ్యమిస్తున్న రష్యా తొలి మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. సౌదీ అరేబియాతో జరిగిన తొలి పోరులో 5-0 తేడాతో స్వంతం చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచి ఇన్‌జూరీ టైమ్ వరకు అడుగడుగునా ఆధిపత్యాన్ని కొనసాగించిన రష్యాను సౌదీ అరేబియా ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. డెనిష్ చెరిషెవ్ రెండు గోల్స్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వేలాదిమంది అభిమానుల సమక్షంలో బరిలోకి దిగిన రష్యా మొదటినుంచి తన ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కనబరిచింది. ముమ్మర దాడులకు దిగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసింది. సౌదీ అరేబియా రక్షణ వలయాన్ని ఛేదించడానికి పదేపదే ప్రయత్నం చేసిన రష్యాకు 12వ నిమిషంలో తొలి గోల్ లభించింది. యూరీ గాజిన్‌స్కీ ప్రత్యర్థులను తప్పించుకుంటూ రష్యాకు తొలి గోల్ అందించాడు. ఆరంభంలోనే ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ రష్యా దూకుడును ఆపలేదు. ఒకవైపు సౌదీ అరేబియాను గోల్ చేయకుండానే నిలువరిస్తూనే మరోవైపు గోల్ కోసం శ్రమించింది. ప్రథమార్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో డెనిస్ చెరిషెవ్ ద్వారా రష్యాకు రెండో గోల్ లభించింది. సౌదీ అరేబియాను పూర్తిగా కట్టడి చేసిన రష్యా ద్వితీయార్ధంలో రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. గోల్స్ కోసం ప్రయత్నించకుండా రష్యా ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి ప్రయత్నించి సఫలమయ్యారు. మూడవ క్వార్టర్ ముగిసిన తర్వాత రష్యా మరోసారి గోల్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 71వ నిమిషంలో ఆర్టెమ్ జుబా గోల్ చేయడంతో రష్యాకు తిరుగులేని 3-0 ఆధిక్యం లభించింది. 90 నిమిషాల ఆట ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. అయితే, ఇన్‌జూరీ టైమ్‌లో రష్యా రెచ్చిపోయింది. డెనిస్ చెరిషెవ్ ఇన్‌జూరీ టైమ్ మొదటి నిమిషంలోనే గోల్ చేశాడు. మరో మూడు నిమినిషాల తర్వాత అలెగ్జాండర్ గొలోవిన్ గోల్ చేసి రష్యాను 5-0 తేడాతో గెలిపించాడు.

చిత్రం..డెనిష్ చెరిషెవ్