క్రీడాభూమి

పిసిబికి ఆశకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 19: స్వదేశంలో క్రికెట్ సిరీస్‌లు పాకిస్తాన్‌కు ఎండమావిగానే మారాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకూ పెద్ద జట్లు ఏవీ పాకిస్తాన్‌లో పర్యటించలేదు. గత ఏడాది డిసెంబర్‌లో భారత్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ రద్దయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఖరారు చేసిన టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రకారం ఈఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పాకిస్తాన్‌తో వెస్టిండీస్ రెండు టెస్టులు, ఐదు వనే్డ, రెండు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడనుంది. చాలాకాలంగా హోం సిరీస్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఆడుతున్న పాకిస్తాన్ ఈసారి కూడా అక్కడే మ్యాచ్‌లకు సిద్ధమైంది. అయితే, స్వదేశంలో మ్యాచ్‌లకు అనుకూలంగా పరిస్థితిని మార్చడానికి వీలుగా యుఎఇలో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో రెండుమూడు మ్యాచ్‌లను తమ దేశంలో ఆడాల్సిందిగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కోరింది. కానీ, భద్రతా కారణాలను ఉటంకిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో మ్యాచ్‌లు ఆడడం అసాధ్యమని డబ్ల్యుఐసిబి తెగేసి చెప్పడంతో పిసిబి ఆశలకు గండిపడింది.
భద్రతపై అనుమానాలు వద్దు: షహర్యార్
తమ దేశంలో ఆటగాళ్ల భద్రతపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. ఇటీవల టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆడేందుకు పాక్ జట్టును భారత్ పంపడానికి పిసిబి పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని, అందుకే లిఖితపూర్వక హామీ ఇవ్వాలంటూ రాద్ధాంతం చేసిన పిసిబి ఆతర్వాత హఠాత్తుగా మాట మార్చేసింది. భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై అనుమానించతగ్గ అంశాలేవీ కనిపించడం లేదని షహర్యార్ అన్నాడు. భద్రతపై నెలకొన్న అనుమానాలకు తెరపడిందని అన్నాడు. ఇప్పుడు ఇరు జట్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా మ్యాచ్ ఆడాయని అన్నాడు. భారత్‌ను మంచి చేసుకోవడానికే షహర్యార్ ఈ ప్రకటన చేశాడన్నది వాస్తవం. కాగా ఆటగాళ్ల భద్రతకు సంబంధించి విండీస్ బోర్డు తమను ప్రశ్నించకుండా షహర్యార్ ముందుగానే జాగ్రత్త పడ్డాడు. పాక్‌లో ఆటగాళ్లకు పూర్తి భద్రత ఉంటుందని భరోసా ఇచ్చాడు. పాక్‌లో పరిస్థితులు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని, ఇప్పుడు క్రికెట్ సిరీస్‌లకు సానుకూల వాతావరణం ఉందని అన్నాడు. అయితే, డబ్ల్యుఐసిబి మాత్రం షహర్యార్ ఇచ్చిన హామీని నమ్మలేదు. ఆటగాళ్లలో చాలా మంది పాక్‌లో మ్యాచ్‌లకు నిరాకరిస్తున్నారని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ విండీస్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశించిన పిసిబి ఇప్పుడు మరోసారి పునరాలోచనలో పడింది. వివిధ దేశాల జట్లను ఏ విధంగా రప్పించాలో అర్థంగాక మల్లగుల్లాలు పడుతున్నది.