క్రీడాభూమి

వ్యూహం మార్చు..లేదంటే...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 18: డిగో మారడోనాకు కోపం వచ్చింది. ఐస్‌లాండ్‌తో ఆరంభ మ్యాచ్ ఆడిన అర్జెంటీనా ‘డ్రా’ స్థితిలో నిలవడంతో చిరాకు తన్నుకొచ్చింది. ఆ అసహనాన్ని కోచ్ జోర్జ్ శాంపోలి మీద చూపించాడు. ‘జట్టు వ్యూహాన్ని మార్చి అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రతాపాన్ని ప్రదర్శించు. లేదంటే దేశానికి నిన్ను ఆహ్వానించలేను’ అంటూ అర్జెంటీనా మాజీ స్టార్ ప్లేయర్ మారడోనా దాదాపు హెచ్చరిక చేశాడు. అవకాశం దక్కినా పెనాల్టీని మిస్ చేసుకున్న మెస్సీని ఒక్కమాట కూడా అనకుండానే, ఆ తప్పునకు కారణం కోచ్ అంటూ వేలెత్తి చూపించాడు. ‘పేలవమైన వ్యూహంతో ఆటను ఇలాగే సాగించావంటే, నిన్ను మాతృ దేశానికి ఆహ్వానించేది లేదు’ అంటూ వెనుజిలా టెలివిజన్ చానెల్ వద్ద వ్యాఖ్యానించాడు. నిజానికి మెస్సీకి పెనాల్టీ షాట్స్ అవకాశం వచ్చినా, ఐస్‌లాండ్ గోల్‌కీపర్ హేన్ హాల్డర్‌సన్ తన సమర్థతతో నిలువరించాడు. ఆట చివరి క్షణంలో అందిన అవకాశాన్నీ మెస్సీ వినియోగించుకోలేక పోవడంతో ఐస్‌లాండ్‌తో అర్జెంటీనా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ పరిస్థితిపై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఆటగాళ్లను అనడానికి ఏమీ లేదు. జట్టు నాయకుడు వ్యూహాలు సరిగ్గావుంటే, ఆటగాళ్లు ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు’ అంటూ మారడోనా వ్యాఖ్యానించాడు. ‘మరోసారి స్పష్టం చేస్తున్నా. వ్యూహాలు మార్చుకోకపోతే, స్వదేశానికి నిన్ను ఆహ్వానించలేను’ అంటూ కోచ్ జోర్జ్ శాంపోలికి హెచ్చరిక చేశాడు.
వచ్చే వరల్డ్ కప్‌లో ఈజిప్టు తరఫునే..
సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 18: వచ్చే వరల్డ్ కప్ మ్యాచ్‌లో తాను ఈజిప్టు తరఫున ఆడనున్నట్టు ప్రముఖ సాకర్ ఆటగాడు మహమ్మద్ సాలాహ్ అన్నాడు. ఆదివారం 26వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అతను ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనే ముందు గత నెలలో జరిగిన చాంపియన్ లీగ్ ఫైనల్‌లో ఎడమ చేతి భుజానికి గాయమైంది. శుక్రవారం ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో ఈజిప్టు ఓటమి చెందడంతో కాస్త కలత చెందాడు. ఇపుడు సాలాహ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని ఈజిప్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్హాబ్ లెహెతా తెలిపాడు. కాగా, ఈజిప్టు వచ్చే మంగళవారం సెయంట్ పీటర్స్‌బర్గ్‌లో ఆతిధ్య రష్యాతోను, ఈనెల 25న సౌదీ అరేబియాతోను తలపడనుంది.