క్రీడాభూమి

మెస్సీ కోసం.. మహా ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 18: అభిమానం హద్దులు దాటింది. వీరాభిమానం రష్యాకు దారితీసింది. ఎందుకంటే, అక్కడ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఉంది. ఆ బంతిని సమర్థంగా తన్నగల మెస్సీ ఉన్నాడు. ఫేవరిట్ స్టార్ ఆటగాడి కోసం సైకిల్‌పై రష్యాకు మహా ప్రయాణమయ్యాడు కేరళకు చెందిన 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ క్లిఫిన్ ఫ్రాన్సిస్. ఇతగాడు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీకి వీరాభిమాని. అతనిని ఎలాగైనా కలవాలని ఎంతోకాలంగా ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ అంత ఆర్థిక స్తోమత లేదు. అయితేనేం ధైర్యం చేశాడు. అనుకున్నదే తడవుగా తొలుత దుబాయ్ వెళ్లాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సైకిల్‌ను కొనుగోలు చేసి, దానిపై రష్యాకు దారితీశాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్ల మధ్య జార్జియా, అజర్‌బైజాన్ వంటి దేశాల మీదుగా చివరకు రష్యాలోని తాంబోవ్ చేరుకున్నాడు. ఇక్కడ నుంచి 21న మాస్కో చేరుకుంటాడట. 26 నాటికి ఫ్రాన్స్- డెన్మార్క్ మధ్య జరిగే మ్యాచ్‌కు చేరుకుంటాడు. ఈ నాలుగు నెలల తన సుదీర్ఘ సైకిల్ ప్రయాణంలో వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడంతోపాటు ఎన్నో తీపిగుర్తులతోపాటు చేదు అనుభవాలు కూడా చవిచూశానని క్లిఫిన్ అన్నాడు. జర్మన్ సైక్లిస్టు ఒకడు తన ప్రయాణానికి తగిన మార్గదర్శకం చేశాడని, జర్మనీ ప్రజల ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు, వారిచ్చిన ఆహారం, ఆతిధ్యం వంటివి తననెంతో ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నాడు.