క్రీడాభూమి

కోచ్‌లకు కొదవుండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: దేశంలో అథ్లెటిక్స్‌ను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడం ద్వారా క్రీడాకారులను తయారు చేసేందుకు వీలుగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎఫ్) రానున్న ఐదేళ్ల కాలంలో వెయ్యిమంది నైపుణ్యం కలిగిన కోచ్‌లను నియమించనుంది. తగిన కార్యాచరణతో ముందుకెళ్తూ, గతనెలలో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో లెవెల్-1 పేరిట తొమ్మిది వర్క్‌షాపులు నిర్వహించింది. ప్రతి కోర్సులో 24మంది ఉండేలా చెన్నై, రాంచి, గ్వాలియర్, పాటియాలా, గౌహతిలో వర్క్‌షాపులు చేపట్టింది. వచ్చే సెప్టెంబర్- అక్టోబర్‌లో ఇదే నగరాల్లో మరోసారి వర్క్‌షాపులు నిర్వహించనుంది. ఇప్పటివరకు 40మంది కంటే తక్కువమంది ఐఏఏఎఫ్ క్వాలిఫైడ్ లైసెన్సులు కలిగిన కోచ్‌లున్నారని, భవిష్యత్తులో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జాతీయ ఇనిస్టిట్యూట్ల నుంచి సమర్థులైన డిప్లొమా హోల్డర్లను ఎంపిక చేసే అవకాశం ఉందని నేషనల్ అథ్లెటిక్స్ డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ తెలిపాడు. ఈ ఏడాది 200 మంది నిష్ణాతులైన కోచ్‌లను ఎంపిక చేసే అవకాశం ఉందని, దేశంలోని ప్రతి జిల్లాలో అర్హత కలిగిన కోచ్ ఉండాలనే నిర్ణయంతో క్రమేణా కోచ్‌ల సంఖ్యను రానున్న ఐదేళ్లలో వెయ్యిమంది వరకు నియమించే అవకాశం ఉందని వివరించాడు.