క్రీడాభూమి

మాయచేసిన మాడ్రిడ్ హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ బి మ్యాచ్‌ను క్రిస్టియానో కిక్కెక్కించాడు. మాడ్రిడ్ స్టార్ మహా వేగాన్ని చూసి ఫుట్‌బాల్ అభిమానులు నోరెళ్లబెట్టారు. 1-0తో మొరాకోను మట్టికరిపించిన పోర్చుగల్ ప్రతాపాన్ని చూసి ‘రోనాల్డో ఒక్కడు చాలు’ అంటూ నినాదాలు చేశారు. ఆట మొదలైన దగ్గర్నుంచీ ముగిసే వరకూ మైదానం మొత్తం ‘సీఆర్7 సీఆర్7’ (రొనాల్డో ముద్దుపేరు) అంటూ హోరెత్తిపోయింది. గ్రూప్ బి మ్యాచుల్లో భాగాంగా బుధవారం మాస్కోలోని లుజునికి స్టేడియంలో పోర్చుగల్ -మొరకో జట్లు తలపడ్డాయి. ఆదినుంచీ ఆట భీకరపోరుగానే సాగినా, మాడ్రిడ్ స్టార్ మాయ ముందు మొరకో నిలబడలేకపోయింది. ఆట మొదలైన నాల్గవ నిమిషంలోనే అత్యంత వేగంగా రికార్డ్ గోల్ సాధించిన రోనాల్డో, ప్రపంచ కప్‌లో పోర్చుగల్‌తో బోణీ కొట్టించాడు. ప్రపంచకప్‌లో ఎక్కువ గోల్స్ సాధించిన రెండో ఆటగాడిగా రోనాల్డోకు రికార్డు దక్కింది. ప్రపంచ కప్‌లో ఇరాన్ ఆటగాడు అలి డారుూ (109) ఎక్కువ గోల్స్ చేసిన రికార్డు సాధించాడు. ఆట మొదలైన నాల్గవ నిమిషంలోనే రోనాల్డో గోల్ సాధించడంతో, మొరాకో జట్టుపై వత్తిడి పెరిగింది. దీంతో మొరాకో కోచ్ హెర్వే రెనార్డ్ తన వ్యూహాన్ని మార్చేశాడు. మాన్యువల్ డ కోస్టా, నబిల్ డిరార్ స్థానాలను మార్చి మొరాకో జట్టుకు కొత్త ఊపునిచ్చాడు. మొరాకో వ్యూహం రొనాల్డో ముందు నిలవలేదు. జట్టు గెలుపు బాధ్యతను భుజస్కందాలపై వేసుకుని ప్రథమార్థం ఆరంభంలోనే పోర్చుగల్‌ను ఆధిక్యతలో నిలబెట్టిన రోనాల్డో, ఆ తరువాత మొరాకోకు ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు. క్రిస్టియానో వేగానికి మొరాకోనే కాదు, అభిమానులు బిత్తరపోయారు. ఈ మ్యాచ్‌లో సాధించిన గోల్‌తో గ్రూప్ బిలో అత్యుత్తమ, ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగానూ మాడ్రిడ్ స్టార్‌కు మకుటం దక్కింది. ప్రథమార్ధంలో పోర్చుగల్‌ను వెంటాడుతూ మరో గోల్ చేయకుండా అడ్డుకోగలిగిన మొరాకో, ద్వితీయార్థంలోనూ ఆటాకింగ్‌తోనే ఆట సాగించింది. కానీ, ద్వితీయార్థంలో ఒక్క గోల్ కూడా సాధ్యం కాకపోవడం, సమయం పూర్తవ్వడంతో మొరాకో అపజయంతో మైదానం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్ ఏ మ్యాచ్‌ను టై చేసుకున్న పోర్చుగల్, గ్రూప్ బి మ్యాచ్‌లో మొరాకోపై విజయం సాధించడంతో ప్రపంచ కప్‌లో బోణీ కొట్టినట్టయ్యింది. అయితే, మొరాకో మాత్రం గ్రూప్ ఏ, బి మ్యాచ్‌లను సైతం చేజార్చుకుని అపజయాలను మూటగట్టుకుంది. ఇదిలావుంటే, పోర్చుగల్ జూన్ 25న ఇరాన్ జట్టును ఎదుర్కోబోతోంది.
మా సత్తా ఇంకా చూపాలి..
మొరాకోపై సాధించిన విజయంతో క్రిస్టియానో రోనాల్డో ఏమంత పొంగిపోలేదు. ‘పోర్చుగల్ జట్టు బలం ఇది కాదు. ఇంకావుంది. ఆ బలాన్ని ముందు మ్యాచ్‌ల్లో ప్రదర్శించాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు. జట్టు మరింత కసిని చూపించాల్సి ఉందన్నది మ్యాచ్ అనంతరం మాడ్రిడ్ స్టార్ మాటల్లో కనిపించింది. ‘మ్యాచ్ గెలవడం ఆనందంగానే ఉంది. ఈ మ్యాచ్ గెలిచి మూడు పాయింట్లు సొంతం చేసుకున్నాం’ అన్నాడు. ‘ఈ మ్యాచ్ ఓడిపోయివుంటే పోర్చుగల్ పనైపోయి ఉండేది. ఆ విషయం తెలుసుకనుకే, గెలవాలన్న మరింత కసితో ఆడాం. మొరాకో జట్టు బలమెంతో ఈ మ్యాచ్‌తోనే అర్థమైంది. అన్ని శక్తియుక్తులూ ప్రదర్శించారు. నిజానికి ఆట ప్రారంభంలోనే సాధించిన గోల్ మాకు ఉపయుక్తమైంది. లేదంటే మొరాకో ఆటగాళ్ల దాటికి ఇబ్బంది పడేవాళ్లం’ అని మ్యాచ్‌ను విశే్లషించాడు. సర్నాస్క్‌లో జూన్ 25న ఇరాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం అన్నాడు. ‘మా సత్తాకు మరింత పదును పెట్టుకోవాల్సి ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘పోర్చుగల్ జట్టు దాదాపు నాకౌట్ దశకు చేరుకుంటోంది. ఇకనుంచి మేం తీసే ప్రతి పరుగూ ముఖ్యమే. ఒక్కో మ్యాచ్ నెగ్గుకుంటూ ప్రపంచ కప్ సాధించాలన్నది మా జట్టు కల’ అంటూ మాడ్రిడ్ స్టార్ మనసులో మాట బయటపెట్టాడు.