క్రీడాభూమి

అభిమానుల వానతాండవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూన్ 24: ఘోర పరాభవంతో ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నుంచి జర్మనీ గట్టెక్కడంతో బెర్లిన్‌లో అభిమానులు వానానందం పొందారు. అదృష్టం క్రూస్ రూపంలో కలిసొచ్చి స్వీడన్‌పై విజయం సాధించటంతో అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వర్షంలో ఆనందతాండవం చేశారు. బ్రాండ్‌బెర్గ్ గేట్‌వద్ద ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్ చూస్తున్న అభిమానులు తొలుత నిరుత్సాహంలో ఉండిపోయాడు. మేఘావృతమైన వాతావరణంలో నిస్సారంగా నిలబడిన అభిమానుల్లో క్రూస్ అద్భుత గోల్ ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో భోరున వర్షం కురియడంతో, వానలోనే ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ‘క్రేజీ. జర్మనీని గట్టెక్కించిన జట్టుకు ప్రశంసలు, ధన్యవాదాలు’ అంటూ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ సెయిబెర్ట్ చేసిన ట్వీట్ మరింత ఉత్సాహాన్ని నింపింది. ‘అటు ర్యూస్. ఇటు క్రూస్. వరల్డ్ కప్ జర్మనీదే’ అంటూ అభిమానులు నినాదాలిచ్చారు.