క్రీడాభూమి

జనవరిలో జరక్కపోతే ఏడాది దాకా జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 11: ప్రతిపాదిత భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ గనుక వచ్చే నెల లోపల జరగనట్లయితే మరో ఏడాది దాకా జరిగే అవకాశం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. ‘ఇప్పుడు గనుక ఈ సిరీస్ జరక్క పోతే మరో ఏడాది దాకా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది అంతా రెండు జట్లకు ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉంది’ అని ఆయన అన్నాడు. అంతేకాక ద్వైపాక్షిక సిరీస్ ప్రపంచ టి-20 టోర్నమెంటు రెండూ వేర్వేరు అంశాలని కూడా ఆయన స్పష్టం చేసాడు. ‘ఇది రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్,ప్రపంచ టి-20 టోర్నమెంట్ ఐసిసి ఈవెంట్’ అని ఆయన అన్నాడు. అయితే వచ్చే మార్చిలో భారత్‌లో జరగబోయే ప్రపంచ టి-20 టోర్నమెంటుకు జట్టును పంపించడానికి పిసిబి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉంటుందని షహర్యార్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. శ్రీలంకలో భారత్‌తో జరగాల్సిన స్వల్పకాలిక ద్వైపాక్షిక సిరీస్‌కు భారత క్రికెట్ బోర్డు, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఈ సిరీస్ జరిగేలా చూస్తున్నందుకు, దీనికోసం ఒత్తిడి తెస్తున్నందుకు తనను చాలామంది విమర్శిస్తున్నారనే విషయం తనకు తెలుసునని, అయితే ఇప్పుడు జరక్క పోతే మరో ఏడాది దాకా ఆగాల్సి ఉంటుందని, అందుకే ఇప్పుడే జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పాడు. ఒక వేళ సిరీస్ ఆడడానికి భారత్ అంగీకరించకపోతే పిసిబికి ఆర్థికంగా నష్టం వస్తుందనే మాట నిజమే కావచ్చుకానీ అది దివాలా తీయదని కూడా ఖాన్ వాదించాడు.