క్రీడాభూమి

బిసిసిఐ తొలి సిఇవోగా జోహ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 20: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తొలిసారి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సిఇవో)ను నియమించింది. మీడియా ప్రొఫెషనల్ రాహుల్ జోహ్రీని ఈ పదవికి ఎంపిక చేసినట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతను జూన్ ఒకటిన బాధ్యతలు చేపడతాడని పేర్కొంది. బోర్డు పాలనా వ్యవహారాలు సజావుగా సాగడంతోపాటు, క్రీడాభివృద్ధికి కూడా అతను కృషి చేస్తాడని తెలిపింది. ఇప్పటి వరకూ బోర్డులో ఇసివో పోస్టు లేదు. ఇటీవల కాలంలో బిసిసిఐ పాలనా వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టడంతో సిఇవో పోస్టును బిసిసిఐ కొత్తగా సృష్టించింది. జోహ్రీ తన బాధ్యతను ఎంత వరకూ సమర్థంగా నిర్వహిస్తాడో చూడాలి.