క్రీడాభూమి

కష్టాలకు ఎదురీదుతున్న శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డునెడిన్, డిసెంబర్ 11: న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా డునెడిన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు కష్టాలకు ఎదురీదుతోంది. 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు మరో 22 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టులో ఓపెనర్ కరుణరత్నే బాధ్యతాయుతంగా ఆడినప్పటికీ మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ (8), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉదర జయసుందర (1) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన శ్రీలంక జట్టును కరుణరత్నే, వికెట్ కీపర్ దినేష్ చండీమల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడిన వీరు మూడో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం కరుణరత్నే (84) సాంట్నర్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక వాట్లింగ్‌కు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో వచ్చిన కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (2) కూడా టిమ్ సౌథీ బౌలింగ్‌లో వాట్లింగ్ చేతికే చిక్కాడు. దీంతో 5 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టుకు చండీమల్ (83), కితురువన్ వితనాగే (10) అజేయంగా 41 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 197 పరుగులు సాధించిన శ్రీలంక జట్టు ఇంకా 234 పరుగులు వెనుకబడి ఉంది.