క్రీడాభూమి

మీరేరా.. హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 11: వాళ్లేమీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ దిగ్గజాలు కాదు. ఫైనల్ మ్యాచ్ ఆడిన దాఖలాలూ లేవు. వాళ్లొక పిల్ల ఫుట్‌బాల్ జట్టు మాత్రమే. అయితేనేం, వాళ్లే ఇప్పుడు సాకర్ హీరోలు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఫుట్‌బాల్ క్లబ్‌లు, దిగ్గజ ఆటగాళ్లు సైతం పిల్ల జట్టును హీరోల్లా చూస్తున్నారు. కారణం, మృత్యువుతో గేమ్ ఆడి గెలిచినోళ్లు కనుక. ప్రమాదవశాత్తూ థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుని పద్దెనిమిది రోజులు ప్రాణాలతో గేమ్ ఆడి గెలిచినోళ్లు. ఆ ఆనందంతోనే ఫుట్‌బాల్ దిగ్గజాలు వైల్డ్ బార్స్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టును హీరో చేసేస్తున్నారు. రెండువారాల గుహ నిర్బంధం నుంచి ప్రాణాలతో బయటపడిన పిల్ల ఫుట్‌బాల్ జట్టును చూసి ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా, ఇంగ్లాండ్ డిఫెండర్ కిలీ వాకర్‌లాంటి ఆటగాళ్లు, మాంచెస్టర్ యునైటెడ్, బార్సిలోనాలాంటి ఫుట్‌బాల్ క్లబ్‌లు ఎక్కడలేని ఆనందం వ్యక్తం చేశాయి. థాయ్ గుహ నుంచి పిల్లలంతా క్షేమంగా బయటపడ్డారన్న వార్త మహదానందం కలిగిస్తోంది. నా ఆనందం కొద్దీ వాళ్లకు ఫుట్‌బాల్ షర్ట్‌లు పంపుతా. వాళ్ల అడ్రెస్‌లు చెప్పరూ ప్లీజ్.. అంటూ కిలీ ట్వీట్ చేశాడు. ఉత్తర థాయ్‌లాండ్‌లోని కేవ్ కాంప్లెక్స్‌లో గత జూన్ 23న 11నుంచి 16ఏళ్ల పిల్లలు 12మంది సహా పాతికేళ్ల ఫుట్‌బాల్ కోచ్ వరదల కారణంగా గుహ నిర్బంధానికి గురవ్వడం తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన థాయ్ నేవీ సీల్స్ 18 రోజుల అనంతరం మంగళవారం జట్టు మొత్తాన్ని ప్రాణాలతో సరక్షితంగా బయటికి తెచ్చారు. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారన్న సమాచారంపై ఫుట్‌బాల్ ప్రపంచ గవర్నింగ్ బాడీ ఫిఫా ఆనందం వ్యక్తం చేసింది. ‘పిల్లలంతా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్ గేమ్‌కు రావొచ్చంటూ ఆహ్వానాలు సైతం ప్రకటించింది. అయితే, పిల్లలు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రష్యాకు తీసుకురావడం ఇబ్బందికరమే. అందుకే, వాళ్లను ఫైనల్ మ్యాచ్‌కు తీసుకురాలేకపోతున్నాం’ అని అధికారి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ సీజన్‌లో ఓల్డ్ ట్రఫొర్డ్‌కు రావాలంటూ మాంచెస్టర్ యునైటెడ్ మాత్రం పిల్లల జట్టు, వాళ్లను రక్షించిన నేవీ సీల్ జట్టుకు ప్రత్యేక ఆహ్వానాలు అందించింది. ‘వాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారన్న సమాచారం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది’ అంటూ క్లబ్ ట్వీట్ చేసింది. అంతేకాదు, వైల్డ్ బోర్స్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు బార్సిలోనా నుంచీ ఆహ్వానం రావడం గమనార్హం. ‘వచ్చే ఏడాది జరగనున్న బార్కా అకాడెమీ అంతర్జాతీయ టోర్నీలో భాగంగా నోవు మైదానానికి రావాల్సిందిగా స్పానిష్ దిగ్గజాలు ఆహ్వానించాయి.