క్రీడాభూమి

చెప్పుకోలేనంత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 11: బెల్జియం కల ఒక్క అడుగూ ముందుకుపడలేదు. పడే అవకాశమూ ఇక లేదు. ఫ్రాన్స్ చేతిలో బెల్జియం ఓడిపోయింది. ఆ దేశం కలపై 1-0తో ఫ్రాన్స్ పిడుగుపడింది. చివరి వరకూ ఉత్కంఠ రేకెత్తించి, తరువాత చేతులెత్తేయడం లాంటి సెంటిమెంట్‌ను బెల్జియం కంటిన్యూ చేసింది. నిజానికి 2014 ప్రపంచకప్, 2016 యూరో క్లబ్ టోర్నీల్లో బెల్జియం క్వార్టర్స్‌లో విజయం సాధించి సెమీస్‌లో బోల్తాపడింది. ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న ఆశ అప్పట్లో నెరవేర లేదు. ఇప్పడూ అదే జరిగింది. ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో, ఇంటర్నేషనల్ ఫైనల్ మ్యాచ్ ఆడాలన్న కల కల్లగానే మిగిలిపోయింది. ఈ టోర్నీలో 14 గోల్స్‌తో లీడింగ్‌లో ఉన్న బెల్జియానికి గెలుపు అవకాశం ఉంటుందన్న అంచనాలు వినిపించాయి. కానీ, ఫ్రాన్స్ ముందు బెల్జియం ఆట సాగలేదు. ఆరంభ మ్యాచ్‌ల్లో లయనెల్ మెస్సీ, క్రిస్టియనో రొనాల్డో, నేమార్‌ల స్థాయి ఆటగాళ్లుగా చెలరేగిపోయి పేరు ప్రఖ్యాతలు గెలుచుకున్న ఎడెన్ హజార్డ్, ఎంబప్పెలు చివరి మ్యాచ్‌లో పూర్తిగావిఫలమయ్యారు.