క్రీడాభూమి

ఫ్రాన్స్‌లో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 11: పారిస్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫిఫా వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నంత ఘనంగా వేలాది మంది అభిమానులు, ప్రజలు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. డిడర్ డెస్‌చాంప్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంను 1-0 తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో భారీగా గోల్స్ నమోదు కానప్పటికీ పోరాటం మాత్రం భీకరంగా కొనసాగింది. 55వ నిమిషంలో శామ్యూల్ ఉమ్‌టిటీ చేసిన గోల్ ఫ్రాన్స్‌ను ఫైనల్ చేర్చింది. ఒకరి అవకాశాలను మరొకరు దెబ్బతీసుకుంటూ, సమయం దొరికిన ప్రతిసారి దాడులకు ఉపక్రమిస్తూ ఇరు జట్లు నువ్వా నేనా అన్న చందంగా తలపడ్డాయి. టెక్నికల్ కోణంలో చూస్తే, ఈ టోర్నీలో ఇంత వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యంత గొప్ప మ్యాచ్‌గా విశే్లషకులు సైతం అభివర్ణించారు.
థాయ్ ఆటగాళ్లకు అంకితం
మాస్కో: సెమీ ఫైనల్‌లో బెల్జియంపై సాధించిన విజయాన్ని థాయిలాండ్‌లోని గుహలో చిక్కుపడి, మృత్యుంజయుల్లా తిరిగి వచ్చిన యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అంకితమిస్తున్నట్టు ఫ్రాన్స్ స్టార్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా ప్రకటించాడు. మంగళవారం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిని రేపిన అంశాల్లో ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఒకటికాగా, థాయిలాండ్ గుహలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు జరిగిన ప్రయత్నం మరొకటి. యువ థాయ్ ఆటగాళ్లు మృత్యువును జయించారని, అచంచలమైన ఆత్మవిశ్వాసమే వారిని కాపాడిందని పోగ్గా ట్వీట్ చేశాడు. అలాంటి వారే నిజమైన హీరోలని, అందుకే బెల్జియంపై సాధించిన సెమీ ఫైనల్ విజయాన్ని వారికే అంకితం ఇస్తున్నామని పేర్కొన్నాడు.
భిన్నస్వరాలు..
బ్రసెల్స్: ఫ్రాన్స్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, ఫిఫా వరల్డ్ కప్ సాకర్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ నుంచే వెనుదిరిగిన తమ జట్టుపై బెల్జియం అభిమానులు, క్రీడాకారులు, ప్రజల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు విచారం ప్రతి ఒక్కరినీ విచిత్రమైన స్థితిలోకి నెట్టాయి. ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సంపాదించడమేగాక, సెమీ ఫైనల్ వరకూ చేరడం పట్ల చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాకర్‌లో బెల్జియంకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనమని పేర్కొంటున్నారు. అయితే, సెమీ ఫైనల్‌లో గట్టిపోటీని ఇచ్చినప్పటికీ పరాజయాన్ని ఎదుర్కోవడం పట్ల విచారం కూడా వ్యక్తమవుతున్నది. చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ శామ్యూల్ ఉమ్‌టిటీని గోల్ చేకుండా నిలువరించలేకపోయారని కొంతమంది అభిమానులు వాపోతున్నారు. అయితే, స్థూలంగా చూస్తే, బెల్జియం కొనసాగించిన పోరాటం పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నది.