క్రీడాభూమి

ఫెదరర్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై: వింబుల్డన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో స్టార్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో స్టార్ క్రీడాకారుడు నవోక్ జొకోవిచ్ ఘన విజయం సాధించాడు. ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించి ఎనిమిదోసారి బరిలోకి దిగిన స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రత్యర్థి, దక్షిణాఫ్రికాకు చెందిన ఎనిమిదో సీడ్ క్రీడాకారుడు కెవిన్ ఆండర్సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-6, 6-7 (5/7), 7-5, 6-4, 13-11తో పరాజయం పాలయ్యాడు.
నాలుగు గంటల 13 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఫెదరర్ షాక్ తిన్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లోనే తిరుగుముఖం పట్టడం ఫెదరర్‌కు ఇది రెండోసారి. 2013 వింబుల్డన్‌లో అప్పటి ప్రత్యర్థి సెర్జీ స్టకోవస్కీ చేతిలో రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెదరర్‌పై విజయం సాధించిన కెవిన్ ఆండర్సన్ శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో తొమ్మిదో సీడ్ ఆటగాడు అమెరికాకు చెందిన జాన్ ఇస్నెర్ లేదా 2106 రన్నరప్ మిలోస్ రవోనిక్‌తో తలపడతాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఫెదరర్‌ను ఓడించిన మ్యాచ్‌ను చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటానని ఆండర్సన్ పేర్కొన్నాడు.
మరో మ్యాచ్‌లో మూడుసార్లు వింబుల్డన్ చాంపియన్ కిరీటాన్ని అందుకున్న నవోక్ జొకోవిచ్ తన సమీప ప్రత్యర్థి, జపాన్‌కు చెందిన కై నిష్‌కోరిని 6-3, 3-6, 6-2, 6-2 తేడాతో ఓడించి ఎనిమిదోసారి వింబుల్డన్ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. 31 ఏళ్ల జొకోవిచ్ తన క్రీడా జీవితంలో 32వ గ్రాండ్ శ్లామ్ సెమీఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ రాఫెల్ నాదల్ లేదా ఐదో సీడ్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రోతో తలపడతాడు.
2016 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత జొకోవిచ్ సెమీఫైనల్‌కు చేరిన తొలి మేజర్ టోర్నమెంట్ శుక్రవారం జరుగుతుంది.