క్రీడాభూమి

ఫొటోగ్రాఫర్ సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 12: ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్స్‌లో క్రొయేషియా జట్టు ఆటగాళ్లు గెలుపు సంబరాలను జరుపుకుంటున్న తరుణంలో వారిమధ్యకు దూసుకువచ్చిన ఫొటోగ్రాఫర్ ఆనందానికి అవధుల్లేవు. ఈ మ్యాచ్ అదనపు సమయంలోని 109వ నిమిషంలో క్రొయేషియా ఫార్వార్డ్ ఆటగాడు మారియో మాడ్జుకిక్ గోల్ చేసి తమ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తమ జట్టు ఫైనల్‌కు చేరిన సందర్భంగా మారియో పరుగెత్తుకుంటూ గెలుపు సంబరాలను ఆస్వాదిస్తూ పిచ్ చివరివరకు వెళ్లాడు. అదే సమయంలో యూరీ కార్టెజ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరా లెన్స్‌ను మార్చేందుకు సిద్ధమై ఫొటోలు తీయడానికి ఉపక్రమిస్తుండగా మారియో ఆనందంలో అతనిని తాకడంతో అమాంతం కెమెరాతో సహా కింద పడ్డాడు. జట్టు ఆటగాళ్లు కింద పడిన ఫొటోగ్రాఫర్‌ను గమనించి పైకి లేవనెత్తడమే కాకుండా పడిపోయిన కెమెరాను అతని చేతికి అందించడంతోపాటు అతనితో సంతోషంగా ఫొటోలు కూడా దిగారు. ఒక ఆటగాడు కెమెరామన్ లెన్స్ పట్టుకోగా మరో ఆటగాడు తనను ముద్దాడడంతో ఫొటోలో చిత్రీకరించాడు.

చిత్రం..యూరీ కార్టెజ్