క్రీడాభూమి

ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రొయేషియా చేతిలో ఓటమిపాలై, వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్ నుంచి వెనుదిరిగామన్న బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు
జగ్రెబ్, జూలై 12: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం మాస్కో లుజ్నికీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో క్రొయేషియా ఆటతీరుపై ఎల్లెడలా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో 2-1తో క్రొయేషియా ఘన విజయం సాధించి ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ పోరులో హోరాహోరీగా తలపడనుంది. ఈ నేపథ్యంలో క్రొయేషియాను ఫైనల్‌కు చేర్చిన జట్టు ఫార్వార్డర్ మారియా మండ్జూకిక్ ఆట 109వ నిమిషంలో చేసిన గోల్ అతనిని రాత్రికి రాత్రే గొప్ప హీరోను చేసింది. క్రొయేషియా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం చాలా అద్భుతమని స్థానిక హెచ్‌ఆర్‌టీ చానల్ కామెంటేటర్ డార్గో కాసిక్ వ్యాఖ్యానించాడు. బోరున వర్షం కురుస్తున్నా వేలాది మంది అభిమానులు ఒకచోట గుమికూడి అక్కడ ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌లో మ్యాచ్‌ను ఆసాంతం తిలకించారు.
‘మా దేశ జట్టు ఫైనల్‌లో చోటు దక్కించుకున్నందుకు గర్విస్తున్నాం. సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఆనందం ఇక్కడితో ఆగదు. ఫైనల్ వరకూ సాగుతుంది’ అని అన్నారు. జట్టును ఫైనల్‌కు చేర్చిన ఘనత వహించిన ఆటగాడు మారియోను అభినందనలతో వారు ముంచెత్తారు. ‘గొప్ప టీమ్‌లే ధైర్యంగా, సమర్ధవంతంగా ప్రత్యర్థిని ఎదుర్కొంటాయి. మా దేశ ఆటగాళ్లు సింహాల్లాంటివాళ్లు’ అని స్థానిక మీడియా క్రొయేషియా హీరోలను ప్రస్తుతించింది. ‘ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోండి..క్రొయేషియా జట్టు చరిత్రనే తిరగరాసింది. పటిష్ట ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాం’ అంటూ స్పోర్ట్స్‌కె నొవోస్టి అనే ఆన్‌లైన్ పేపర్ పేర్కొంది. ‘సెమీస్‌లో గెలిచిన క్షణాలు ఎంతో ఉద్వేగభరితమైనవి. ఎన్నో అవరోధాలను అధిగమించి ఫైనల్‌కు చేరుకున్నాం..ఫైనల్‌లోనూ ఎలాంటి భయం, ఆందోళన లేకుండా దూసుకుపోండి..గెలుపు మనదే’ అంటూ ఇంకో పత్రిక తమ దేశ ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తింది.

చిత్రం.. మారియా మండ్జూకిక్