క్రీడాభూమి

చివరి క్షణాల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో :వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఈసారి ఫైనల్ చేరే అవకాశం ఉన్న ఇంగ్లాండ్‌ను క్రొయేషియా సెమీ ఫైనల్‌లో ఓడించడం ఒక అద్భుతంగా కనిపించింది. చివరి క్షణాల్లో మారియో మాడ్జుకిక్ చేసిన గోల్ క్రొయేషియాను తుది పోరుకు చేర్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు గొప్పగా పోరాటం సాగించాయి. అయితే, ఇంగ్లాండ్ అవసరాన్ని మించిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, పరాజయాన్ని మూటగట్టుకుంది. షూటౌట్ ద్వారా ఫలితం తేల్చాల్సిన పరిస్థితి తప్పదనుకుంటున్న తరుణంలో, ఎక్‌స్ట్రాటైం చివరి క్షణాల్లో క్రొయేషియా గోల్ చేసి, 2-1 తేడాతో గెలిచింది. మైదానంలో హోరాహోరీ పోరాటం సాగుతున్నప్పుడు, ఏ ఒక్క క్షణం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం ఇంగ్లాండ్ పరాజయం స్పష్టం చేస్తున్నది. మ్యాచ్ మొదలైన ఐదో నిమిషయంలోనే కీరన్ ట్రిప్లర్ ద్వారా మొదటి గోల్ సాధించిన ఇంగ్లాండ్ ఆతర్వాత పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది. దాడులకు దిగేకంటే, ప్రత్యర్థి జట్టును గోల్స్ చేయకుండా నిలువరిస్తేనే అనుకున్న ఫలితం వస్తుందన్న వ్యూహంతో ఆడింది. ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాకపోవడంతో, ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ద్వితీయార్ధంలోనూ రక్షణాత్మక విధానానికే ప్రాధాన్యం ఇచ్చింది. కానీ, సాకర్‌లో ‘పవర్ గేమ్’ ఆడే జట్లలో ఒకటైన క్రొయేషియా ఎదురుదాడికి దిగడంతో ఇంగ్లాండ్ దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుంది. ఒత్తిడిని పెంచిన క్రొయేషియాకు 68వ నిమిషంలో ఇవాన్ పెరిసిక్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత ఇంగ్లాండ్ మాదిరిగానే క్రొయేషియా కూడా డిఫెన్సివ్ ఆటలో మునిగిపోయింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ పరిస్థితి అదే విధంగా కొనసాగింది. దీనితో ఎక్‌స్ట్రాటైమ్ అనివార్యమైంది. ఆ సమయంలోనూ ఇరు జట్లు చాలాసేపు గోల్స్ చేయడంలో సఫలంకాలేదు. ఫలితంగా మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్ ద్వారా నిర్ణయించాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, 109వ నిమిషంలో మారియో మాడ్జుకిక్ చేసిన గోల్ క్రొయేషియాను ఫైనల్‌కు చేర్చగా, ఇంగ్లాండ్‌ను ఇంటిదారి పట్టించింది. మొదటి సెమీ ఫైనల్‌లో బెల్జియంపై 1-0 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్‌లో క్రొయేషియా ఢీ కొంటుంది. అంతకంటే ముందు, శనివారం రోజున బెల్జియం, ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం కోసం పోరాటం సాగిస్తాయి.

చిత్రం..వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై కీలక గోల్ చేసి, క్రొయేషియాను
ఫైనల్ చేర్చిన మారియో మాడ్జుకిక్. ఫైనల్‌లో ఈ జట్టు ఫ్రాన్స్‌ను ఢీకొంటుంది.