క్రీడాభూమి

ఫైనల్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 14: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 23-21, 16-21, 21-9 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందిన గ్రెగొరియా తన్‌జంగ్‌పై విజయం సాధించింది. గంటపాటు కొనసాగిన మ్యచ్‌లో ప్రపంచ రెండో సీడ్ క్రీడాకారిణి సింధు ఆరంభంనుంచీ గట్టి పోటీ ఎదుర్కొంది. మొదటి సెట్‌ను కేవలం రెండు పాయింట్ల ఆధిక్యం 23-21 స్కోరుతో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో సింధు తప్పిదాలను క్యాష్ చేసుకున్న గ్రెగొరియా 21-16తో గెలుపొందింది. దీంతో మూడో సెట్ ఆట కీలకమైంది. ఆటపై దృష్టి సారించిన సింధు, ప్రత్యర్థి కొట్టే షాట్‌లను సులభంగా ఎదుర్కొని మూడో సెట్‌ను 21-9 స్కోరుతో సొంతం చేసుకుని 2-1 తేడాతో మ్యాచ్‌ను గెలుపొందింది. మలేసియా, ఇండోనేసియా టోర్నీల్లో విఫలమైన సింధు, ఈ టోర్నీలో అత్యద్భుత ఆటతీరు ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఒకుహర 21-17, 21-10 స్కోరు తేడాతో ప్రత్యర్థి బీవిన్ జాంగ్నుపై విజయం సాధించింది.