క్రీడాభూమి

జొకోవిచ్ జయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింబుల్డన్, జూలై 14: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కోగా, 21వ ర్యాంక్ ఆటగాడు, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ హోరీహోరీ పోరులో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా శుక్రవారం ఆటను నిలిపివేసే సమయానికి నాదల్‌పై జొకోవిచ్ 6-4, 3-6, 7-6 ఆధిక్యంలో ఉన్నాడు. శనివారం ఇరువురు ఆటగాళ్లు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. చిరకాల ప్రత్యర్థులిద్దరూ చెరి రెండు సెట్లలో విజయాలు నమోదు చేసి సమవుజ్జీలుగా నిలిచారు. దీంతో చివరి సెట్ ఇద్దరికీ కీలకమైంది. నాదల్ నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటనను సమర్థంగా తిప్పికొట్టిన జొకోవిచ్ ఆ సెట్‌తోపాటు మ్యాచ్‌నీ తన ఖాతాలో వేసుకొని, ఆదివారం కెవిన్ ఆండర్సన్‌తో టైటిల్ పోరును ఖాయం చేసుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 52 పర్యాయాలు పరస్పరం తలపడగా, జొకోవిచ్‌కు ఇది 27వ విజయం. నాదల్ 25 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచాడు. 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో జొకోవిచ్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ నాదల్ ఒత్తిడిని తట్టుకోలేక కీలక మ్యాచ్‌ని చేజార్చుకున్నాడు. కాగా, కెరీర్‌లో 13వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకోవడానికి జొకోవిచ్ ఆదివారం పీటర్సన్‌ను ఎదుర్కొంటాడు.
ఆండర్సన్ రికార్డు
వింబుల్డన్: దక్షిణాఫ్రికా టెన్నిస్ స్టార్ కెవిన్ ఆండర్సన్ వింబుల్డన్‌లో తన దేశం తరఫున సరికొత్త రికార్డు సృష్టించాడు. 97 ఏళ్లలో ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మారథాన్ సెమీ ఫైనల్‌లో అతను జాన్ ఇస్నర్‌ను 7-6, 6-7, 6-7, 6-4, 28-24 పాయింట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెల్చుకున్న ఆండర్సన్‌కు ఆ తర్వాత ఇస్నర్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్న అతనికిక పరాజయం తప్పదని, సెమీస్ నుంచే ఇంటిదారి పడతాడని అనుకున్నారు. కానీ, తర్వాతి సెట్‌ను 6-4 ఆధిక్యంతో సొంతం చేసుకొని మ్యాచ్‌కి కొత్త ట్విస్టునిచ్చాడు. దీంతో చివరిదైన ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. చివరి వరకూ కష్టపడిన ఇస్నర్ 24-26 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోగా, రికార్డు విజయంతో ఆండర్సన్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.