క్రీడాభూమి

ఫిట్‌నెస్సే ప్రామాణికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 14: ప్రపంచకప్‌కు ఫిట్‌నెస్సే ప్రామాణికం. ఆ విషయంలో మా ఆటగాళ్లకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రపంచకప్ సాధించలేకపోతే, మేం ఫిట్‌గా లేనట్టేనని వాళ్లే చెబుతున్నారు. అదే నాకు సంతోషం కలిగించే విషయం’ అంటున్నాడు క్రొయేషియా కోచ్ జ్లాట్కో డాలిక్. జట్టులో భారీ మార్పులు, వ్యూహాత్మక ప్రణాళికలతో ఆదివారం ఫ్రాన్స్‌తో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్‌కు క్రొయేషియా జట్టు సన్నద్ధమైంది. అయితే, ఫైనల్‌కు చేరుకునే వరకూ అవిశ్రాంతంగా పోరాడిన కీలక ఆటగాళ్లు కొందరు గాయాలతో సతమతం అవుతున్నారన్న కథనాలపై జ్లాట్కో పైవిధంగా స్పందించాడు. ‘సమరాంగణంలో నేడు జరగబోయే యుద్ధం గురించి మా ఆటగాళ్లకు తెలీంది కాదు. వాళ్ల విషయంలో నేను హ్యాపీ. ఫిట్‌నెస్సే ప్రపంచకప్‌కు ప్రామాణికమన్న ఆలోచనతోనే మావాళ్లున్నారు. మేం కప్ సాధించలేకపోతే, ఫిట్‌నెస్‌తో లేనట్టేనని వాళ్లే చెబుతున్నారు. సో, ఈ విషయంలో కోచ్‌గా నాకు ఎలాంటి సందేహాలూ లేవు’ అంటున్నాడు జ్లాట్కో. ఆదివారం ఫైనల్లో తలపడాల్సిన క్రొయేషియా జట్టులో కీలక ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్‌కే రాలేదు. ఇంగ్లాండ్‌మీద గెలుపులో కీలక భూమిక పోషించిన ఇవాన్ పెరిసిక్ సైతం ఎలాంటి ప్రాక్టీస్‌కూ హాజరు కాలేదు.