క్రీడాభూమి

మహీ.. మరీనూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: సాధించిన ఘనత కంటే శాపనార్థాలే మహేంద్రుడిని ఇబ్బందిపెట్టాయి. ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో వనే్డలో పదివేల పరుగుల మైలురాయిని సాధించి రికార్డు సృష్టించాడు రన్నింగ్ మెషీన్ ధోనీ. ఆ ఘనతను కీర్తించకుండా, మ్యాచ్ ఓటమికి మహేంద్రుడే కారణమంటూ క్రికెట్ అభిమానులు వేలెత్తిచూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏకపక్షంగా సాగే మ్యాచ్‌లను సైతం తనదైన బాదుడుతో భారత్‌కు అనుకూలం చేసిన సంఘటనలు ధోనీ కెరీర్‌లో తక్కువేం కాదు. అలాంటి ఆటగాడు భారీ లక్ష్యఛేదన సమయంలో విజృంభించకుండా (59 బంతుల్లో 37 పరుగులు) నాన్చుడుతో సిరీస్ చేజార్చాడన్నది క్రికెట్ అభిమానుల ఆగ్రహం. ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వనే్డలో 86 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం తెలిసిందే. ధోనీ రెచ్చిపోయివుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నది అభిమానుల అసంతృప్తి. డేవిడ్ విల్లే ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్ని ధోనీ ఎదుర్కోవడం చూసి స్టాండ్స్‌లో అభిమానులు విసుగెత్తిపోయారు. ఓవర్ చివరిలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లు శార్దూల్ ఠాకూర్, ఆక్సర్ పటేల్‌తో ఎనర్జీ డ్రింక్ తెప్పించుకుని తాగి, వాళ్లతో కాసేపు మాట్లాడినప్పుడూ ధోనీ ముఖంలో కసి కనిపించలేదని విమర్శిస్తున్నారు. అభిమానుల అసహనాన్ని గమనించిన ధోనీ, తరువాతి బంతిని బౌండరీకి తరలించబోయి అవుటవ్వడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ పరిస్థితి మొత్తాన్ని గమనించిన ఇంగ్లాండ్ ఆటగాడు జోయ్ రూట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, టీమిండియా సభ్యులు మాత్రం ఇదేం గమనించలేదని కొట్టిపారేస్తున్నారు. అయితే అభిమానులు ఎన్ని శాపనార్థాలు పెడుతున్నా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ధోనీని వెనకేసుకొచ్చాడు. ‘మ్యాచ్ ఓడిన ప్రతిసారీ ధోనీ బ్యాటింగ్ ప్రావీణ్యాన్ని ప్రశ్నించటం ఏమంత క్షేమకరం కాదు’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘మ్యాచ్ మ్యాచ్‌కు అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చేయడం మంచిది కాదు. ఆటను సరిగ్గా ముగిస్తే బెస్ట్ ఫినిషర్ అంటున్నారు. లేకపోతే, శాపనార్థాలు పెడుతున్నారు. ఈ విధానం సరైంది కాదు’ అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించటం గమనార్హం.