క్రీడాభూమి

జగజ్జేత జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: వింబుల్డన్ ఫురుషుల ఫైనల్ వన్‌సైడ్‌గా సాగిపోయింది. అంతా ఊహించిన ఆటగాడే మ్యాచ్ మొత్తం చెడుగుడు ఆడేశాడు. బలమైన నెట్స్, ఫోర్‌హ్యాండ్ షాట్స్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. నాల్గవ వింబుల్డన్ టైటిల్‌తోపాటు, 13వ గ్రాండ్‌శ్లామ్ కిరీటాన్నీ నెత్తికెత్తుకున్నాడు. అతనెవరో కాదు.. 31ఏళ్ల సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. అద్భుతమేదో జరగొచ్చని ఆశపడిన ఆండర్సన్ ఆరాటం నొవాక్ ముందు నిలవలేదు. చివరి సెట్‌లో పోరాటానికి ఉపక్రమించినా ఫలితం దక్కలేదు. ఆడిన మూడు సెట్లూ (6-2, 6-2, 7-6(7/3)- నొవాక్ పరంచేసి పరాజయాన్ని అంగీకరించాడు. 97ఏళ్ల చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా నుంచి వింబుల్డన్ ఫైనల్‌కు వచ్చిన ఆటగాడిగా ఆండర్సన్‌పై కనబర్చిన ఆసక్తి ఒక్కసారిగా ఆవిరైపోయింది. తాజా గెలుపుతో ప్రపంచ 21వ ర్యాంకింగ్ ఆటగాడు జొకోవిజ్ తన ఖాతాలో నాల్గవ వింబుల్డన్ (2011, 2014, 2015, 2018) చేరుకున్నాడు. పీట్ సంప్రాస్‌కంటే ఒకటి తక్కువ, సెమీస్‌లో తన చేతిలో ఓటమిపాలైన రాఫెల్ నాదల్ కంటే నాలుగు తక్కువ శ్లామ్స్‌తో దూసుకొచ్చాడు.
ఆదివారం మధ్యాహ్నం సెంటర్ కోర్టులో వింబుల్డన్ పురుషుల ఫైనల్స్ హోరాహోరీగా మొదలైంది. సెమీస్‌లో నాదల్‌ను మట్టికరిపించి జొకోవిచ్, ఫెదరర్‌ను ఓడించి సెనే్సషన్ సృష్టించిన ఆండర్సన్ బరిలోకి దిగారు. తొలిసెట్ మొదలైన కొద్దిసేపటికే గేమ్ వన్‌సైడ్‌గా మారింది. జొకోవిచ్ దూకుడును ఎదుర్కోడానికి ఆండర్సన్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. తొలి రెండు సెట్లను సునాయాసంగా కైవసం చేసుకున్న జొకోవిచ్‌కు, మూడో సెట్లో ఆండర్సన్ నుంచి ప్రతిఘటన మొదలైంది. 6-6 స్కోరుతో సెట్ సమం కావడంతో టైబ్రేక్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే టై బ్రేక్‌లో ఆండర్సన్ తీవ్ర వత్తిడికి గురయ్యాడు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న జొకోవిచ్ దాడిని మరింతగా పెంచి 7/3 పాయింట్లతో మూడో సెట్‌ను 7-6 స్కోరుతో కైవసం చేసుకుని వింబుల్డన్ విజేతగా నిలిచాడు.