క్రీడాభూమి

పాపం.. పసికూన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసికూనగా బరిలోకి దిగి కసికూన అనిపించుకున్న క్రొయేషియా -ఫ్రాన్స్ ముందు మాత్రం పసికూనగానే మిగిలిపోయంది. మాజీ చాంపియన్ ముందు క్రొయేషియా ఉరకలు కుప్పిగంతుల్లాగే మిగిలిపోయాయ. సంచలనాల సాకర్‌లో ఏమైనా జరగొచ్చన్న చిన్న ఆశ ప్రపంచ అభిమానులను క్రొయేషియాకు ఫ్యాన్స్ చేసింది. చరిత్ర తిరగరాసేందుకు ఉవ్విళ్లూరిన జెయంట్ కిల్లర్స్.. దిగ్గజ జట్టుముందు నిలవలేకపోయారు. ఫ్రాన్స్ దాడులను ప్రతిఘటించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో వరల్డ్ కప్ కలకు దూరంగా రన్నరప్‌గా నిలబడింది. ఫ్రాన్స్ విజయంకంటే క్రొయేషియా పోరాటమే సాకర్‌లో హైలెట్ అనడం అతిశయోక్తి కాదు.
*
మాస్కో, జూలై 15: వరల్డ్ కప్ సాకర్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి క్రొయేషియా చేసిన పోరాటం ఫలించలేదు. ఆదివారం నాటి ఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడిన ఈ జట్టు రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, జెయింట్ కిల్లర్‌గా ముద్ర వేయించుకొని, అభిమానులను సంపాదించుకుంది. మొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడి సహజంగానే క్రొయేషియాపై ప్రభావం చూపింది. దానికి తోడు స్టార్ ఆటగాడు మారియో మాండ్జుకీ ఆరంభంలోనే ఓన్ గోల్ చేసి, ప్రత్యర్థిని ఆధిక్యంలో నిలబెట్టడం జట్టులోని మిగతా క్రీడాకారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఫ్రాన్స్ దాడులకు ఒకవైపు సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. మ్యాచ్ ఫలితాన్ని చూసి, 2-4 తేడాతో ఓడింది కాబట్టి క్రొయేషియా గొప్పగా ఆడలేదన్న నిర్ణయానికి రావడం తప్పని మ్యాచ్ జరిగిన తీరు స్పష్టం చేస్తున్నది. నిజానికి మారియో ఓన్ గోల్ చేయకుండా, తన జట్టు తరఫునే గోల్ చేసివుంటే, ఇరు జట్లు చెరి మూడు గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచేవి.
ఒకప్పుడు యుగస్లేవియా కింగ్డమ్ కింద ఉన్న క్రొయేషియా 1930 నుంచి 1938 వరకూ ఆ జట్టుకే ప్రాతినిథ్యం వహించింది. అనంతరం 1950 నుంచి 1990 వరకూ ఎస్‌ఎఫ్ ఆర్ యుగస్లేవియా తరఫున ఆడింది. కానీ, ఎప్పుడూ గ్రూప్ దశను అధిగమించలేదు. 1994 వరల్డ్ కప్ నాటికి క్రొయేషియా ప్రత్యేక దేశంగా అవతరించింది. కానీ, వరల్డ్ కప్‌లో ఆడలేదు. స్వతంత్ర దేశంగా 1998లో మొదటిసారి బరిలోకి దిగి, అద్వితీయ ప్రతిభ కనబరచింది. మూడో స్థానాన్ని సంపాదించింది. కానీ, ఆతర్వాత ఈ మెగా టోర్నీకి క్వాలిఫై కావడమే కష్టంగా మారింది. 2002, 2006లో అర్సత సంపాదించినా, గ్రూప్ స్టేజీని అధిగమించలేకపోయింది. 2010లో క్వాలిఫై కాలేదు. 2014లోనూ ఈ జట్టు పోరాటం గ్రూప్ దశను దాటలేదు. ఈసారి వరల్డ్ కప్‌లో అడుగుపెట్టినప్పటికీ, ఎవరూ దీనిని ఒక పోటీదారుగా పరిగణించలేదు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఫైనల్‌కు చేరగలిగింది. ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలుకావడంతో వరల్డ్ కప్‌లో విజేతగా నిలవాలన్న కల నెరవేరలేదు. అయితే, అనామక జట్టుగా పోరును ఆరంభించి, ఫైనల్ వరకూ రావడమే ఈ జట్టు సాధించిన విజయంగా చెప్పుకోవాలి. ఆ పోరాట తత్వమే క్రొయేషియాకు వేలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది.
*ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు ఐదు పర్యాయాలు పరస్పరం ఢీకొన్నాయి. ఫ్రాన్స్ 1998, 1999, 2000 సంవత్సరాల్లో విజయాలు నమోదు చేసింది. 2000, 2011 సంవత్సరాల్లో మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ ఐదు మ్యాచ్‌ల్లో రెండు మేజర్ టోర్నమెంట్లలో జరిగినవి కావడం విశేషం. 1998 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో క్రొయేషియాను ఫ్రాన్స్ 2-1 తేడాతో ఓడించింది. 2004 యూరో చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌ని 2-2గా డ్రా చేసుకుంది.

*ఫ్రాన్స్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1998లో టైటిల్ సాధించింది. 2006లో పెనాల్టీ షూటౌట్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. 1998 తర్వాత, 20 ఏళ్లలో మూడుసార్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన జట్టు ఇదే. ఈ రెండు దశాబ్దాల్లోనే, బ్రెజిల్, జర్మనీ చెరి రెండు పర్యాయాలు ఫైనల్‌లోకి అడుగుపెట్టాయి.

*ప్రపంచ కప్ సాకర్ చరిత్ర తీసుకుంటే, 1930 నుంచి 2014 వరకూ కేవలం 12 దేశాల మాత్రమే ఫైనల్ చేరాయి. ఈసారి క్రొయేషియా జాబితాలో 13వ దేశంగా చోటు సంపాదించింది.

చిత్రం..గోల్ సాధించి ఆనందంలో ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబప్పె