క్రీడాభూమి

రమేష్ పవార్‌కు చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: భారత మహిళా క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను బీసీసీఐ నియమించింది. ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా పనిచేసిన తుషార్ అరోథి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో పవార్‌కు తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్పగించింది. మహళా క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా బిజూ జార్జ్ కొనసాగుతున్నాడు. జూలై 25నుంచి బెంగుళూరులో భారత మహిళా జట్టు శిక్షణ శిబిరం కొనసాగుతోంది. శిబిరంలో సహాయ కోచ్ బిజూతో కలిసి రమేశ్ పవార్ పనిచేస్తాడు. ఇప్పటికే భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి జాతీయస్థాయిలో క్రికెట్ అడిన అనుభవం కలిగి 55ఏళ్ల వయసు కలిగి ఉండాలని సూచించింది. అయితే పూర్తిస్థాయి కోచ్ నియామకానికి మరికొంత సమయం పట్టొచ్చని భావించిన బీసీసీఐ, రమేశ్ పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించింది. 40ఏళ్ల పవార్ భారత్ జట్టు తరపున రెంటు టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొని ఆరు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో 31 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 148 మ్యాచ్‌ల్లో 470 వికెట్లు తీసి అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. గడచిన ఫిబ్రవరి వరకూ పవార్ ముంబయి క్రికెట్ అసోసియేషన్ రన్ క్రికెట్ అకాడమీ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసి నిష్క్రమించాడు. ఫస్ట్ క్లాస్ టీం అనుభవం కలిగిన రమేశ్ పవార్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 20లోపుకోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అనుభవం లేనివారు ఉంటేమాత్రం పవార్‌రే పూర్తిస్థాయి కోచ్‌గా కోనసాగే అవకాశాలు లేకపోలేదు.