క్రీడాభూమి

తెందూల్కర్...తొలి వికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూలై 17: అర్జున్ తెందూల్కర్‌కు వికెట్ పడింది. అదీ, అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మెయిడిన్ వికెట్. కొలంబోలోని నాందెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్‌లో శ్రీలంక యు-19 జట్టుతో భారత యు-19 జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాడు కమిల్ మిశ్రా వికెట్‌ను పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అర్జున్ తొలి వికెట్ తీసుకున్నాడంటూ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లి ట్వీట్ చేశాడు. ‘ఆ దృశ్యాన్ని చూసినపుడు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. వాడు ఎదిగిపోయాడు. క్లిష్టమైన వికెట్‌ను తీసుకున్నాడు. ఇంతకంటే ఆనందం ఏంముటుంది అర్జున్. ఇది ఆరంభం మాత్రమే. అప్రతిహత విజయాలు ఇంకా ముందున్నాయి. తొలి వికెట్ తీసుకున్నా ఆనందాన్ని ఎంజాయ్ చెయ్’ అంటూ కాంబ్లీ ట్వీట్ చేశాడు. శ్రీలంక టూర్‌కు వెళ్లిన అండర్ 19 జట్టులో అర్జున్ తెందూల్కర్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. జూలై 10కి కొలంబో చేరుకున్న భారత జట్టు, శ్రీలంక జట్టుతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. రెండో యూత్ టెస్ట్ మ్యాచ్ జూలై 23నుంచి 26 వరకూ ఉంటుంది. టూర్‌లో భాగంగా శ్రీలంక యూత్ జట్టుతో భారత యూత్ జట్టు ఐదు వనే్డల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ జూలై 29న పి సారాఓవల్ గ్రౌండ్‌లో, తరువాతి రెండు మ్యాచ్‌లు సింహళీల స్పోర్ట్స్ క్లబ్‌లో ఆగస్టు 1, 4 తేదీల్లో జరుగుతాయి. చివరి రెండు వనే్డలు ఆగస్టు 6, 9 తేదీల్లో మారటువాలోని డె సోయ్‌స స్టేడియంలో జరగనున్నాయి.