క్రీడాభూమి

ఒలింపియాడ్ గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: రాబోయే చెస్ ఒలింపియాడ్‌లో భారత క్రీడాకారులు అద్వితీయ ప్రతిభ ప్రదర్శిస్తారన్న ఆశాభావాన్ని ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వ్యక్తం చేశాడు. ‘గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో చెస్ గేమ్ స్థిరంగా వృద్ధి చెందుతోంది. అది వచ్చే చెస్ ఒలింపియాడ్‌లో కనిపించబోతోంది’ అని వ్యాఖ్యానించాడు. ‘చెస్‌పై చాలామంది దృష్టి పెడుతున్నారు. 1987లో నేనే గ్రాండ్ మాస్టర్. ఇప్పుడు దేశంలో 52మంది. ఇదీ భారత్ సాధించిన ప్రగతి’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. పనె్నండేళ్ల వయసులో ప్రజ్ఞానంద గ్రాండ్‌మాస్టర్ సాధించడం గొప్ప విషయమన్నారు. భారత చెస్ ప్రావీణ్యానికి ఒలింపియాడ్ గీటురాయి కానుందని అంటూనే, వివిధ విభాగాల్లో సాగే పోటీల్లో మనవాళ్లు అద్భుతాలు సాధించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 43వ చెస్ ఒలింపియాడ్ గ్రెగోరియాలోని బెటుమిలో సెప్టెంబర్ 23నుంచి అక్టోబర్ 7వరకూ జరగనుంది. ఒలింపియాడ్‌లో తాను పాల్గొనటం వల్ల భారత సామర్థ్యం పెరగనుందని ఆనంద్ అంచనా వేస్తున్నాడు. ‘గత రెండు ఒలింపియాడ్‌లలో భారత ఆటగాళ్లు మంచి ప్రావీణ్యానే్న ప్రదర్శించారు. నేను పాల్గొనడం వల్ల అది మరింత ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా’ అన్నాడు. గ్రాండ్‌మాస్టర్ పి హరికృష్ణ, విదిత్ (గుజరాత్)లు భవిష్యత్‌లో తన సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని ఆనంద్ అన్నాడు.