క్రీడాభూమి

త్వరలో తెండూల్కర్ గ్లోబల్ అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 18: ప్రపంచ మేటి క్రికెటర్లను తీర్చిదిద్దిన మిడ్‌లెసెక్స్ క్రికెట్ సేవలు ఇకనుంచి భారత్‌కూ అందుబాటులోకి రానున్నాయి. అదీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ సారథ్యంలో. క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్, మిడ్‌లెసెక్స్‌ల భాగస్వామ్యంలో ‘తెండూల్కర్ మిడ్‌లెసెక్స్ గ్లోబల్ అకాడామి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 9నుంచి 14ఏళ్లలోపు బాలబాలికలను గొప్ప క్రికెటర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను తెండూల్కర్ మిడ్‌లెసెక్స్ గ్లోబల్ అకాడమి (టీఏంజీఏ) నిర్వహించబోతోంది. ఈ అకాడెమీ నిర్వహించే శిక్షణ శిబిరాల్లో స్వయంగా తెండూల్కర్ సైతం క్లాసులు తీసుకుంటాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ మిడ్‌లెసెక్స్‌తో క్రికెట్‌తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందన్నాడు. ఈ అకాడమీనుంచి ఉత్తమ క్రికెటర్లను అందిచడంతోపాటు దేశానికి మంచి పౌరులను అందించడమే ప్రధాన ఉద్దేశమన్నారు.