క్రీడాభూమి

అంతా రెడీ, కానీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా, జూలై 18: ఆసియా క్రీడల సంరంభానికి మరో నెలలో ఆతిథ్య ఇండోనేసియా ‘షో పీస్’ నిర్వహించనుంది. అందుకు తగ్గట్టుగానే వేదికలన్నీ సిద్ధమవుతున్నాయి. ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. క్రీడా ప్రాంగణాలు నిగ్గుదేలుతున్నాయి. వాటికి దారులుతీస్తూ విశాలమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ అందమైన చెట్లు మొలుచుకొచ్చాయి. మొత్తంగా జకర్తా స్వరూపమే మారిపోతోంది. కానీ..! ఈ పాజ్ దగ్గరే సవాలక్ష సందేహాలు ముసురుతున్నాయి. ఒలింపిక్ తరువాత అంతటి ఖ్యాతినార్జించిన ఆసియా క్రీడల సంరంభానికి ఉగ్రదాడుల బెడద పొంచివుంది. అంతకుమించి అస్తవ్యస్థ జకర్తా ట్రాఫిక్ వ్యవస్థ భయపెడుతుంది. ఆ రెండూ తప్పా అంతా రెడీ అంటున్నారు ఆర్గనైజర్లు.
రాత్రీ పగలూ లేకుండా అహరహం శ్రమిస్తున్న శ్రామికులు, బ్లూప్రింట్ ప్రకారమే దాదాపుగా అంతా సిద్ధం చేసేశారు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వరకూ నిర్వహించే ఆసియా క్రీడలకు 45 దేశాల నుంచి హాజరుకానున్న 11వేల మంది అథ్లెట్లు, 5వేల మంది అధికారుల కోసం జకర్తా, సమత్రాలోని పాలెంబాంగ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒక్క స్క్వాష్ కాంప్లెక్స్ వినా మిగిలిన క్రీడా వేదికలన్నీ రెడీ అయ్యాయి. ఆతిథ్య ఇండోనేషియా 1962లో ఆసియా గేమ్స్ నిర్వహణకు నిర్మించిన ప్రధాన స్టేడియం జెలోరా బంగ్ కర్నోను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ‘నాకు తెలిసి జూలై నెలాఖరునాటికి 95 శాతం స్టేడియంల నిర్మాణం పూర్తవుతుంది’ అని చీఫ్ ఆర్గనైజర్ ఎరిక్ తోహిర్ చెబుతున్నాడు. సంరంభం ఆరంభమయ్యే సమయానికి అసంపూర్తి వేదికలు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2004లో ఒలింపిక్స్ నిర్వహించిన ఏథెన్స్‌లో, 2014లో సాకర్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్‌లో, 2010లో కామనె్వల్త్ గేమ్స్ నిర్వహించిన న్యూఢిల్లీలో కొన్ని ఈవెంట్లకు సంబంధించి వేదికలు సిద్ధంకాలేదన్న విమర్శలు తలెత్తడం తెలిసిందే. అసంపూర్తి మైదానాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించిన సంఘటనలూ ఉన్నాయి. అలాంటి పొరబాట్లు పునరావృతం కాకుండా ఇండోనేసియా జాగ్రత్త పడుతోంది. మరోపక్క 2011లో నిర్వహించిన ఆగ్నేయాసియా గేమ్స్ నిర్వహణలో పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని, ఆసియా దేశాల ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదంతా ఒక ఎత్తు. జకర్తాలో తలెత్తే ట్రాఫిక్ సమస్య మరోఎత్తు. ప్రపంచంలోనే అత్యంత చెత్త ట్రాఫిక్ వ్యవస్థను భరిస్తోన్న జకర్తా, ఆసియా గేమ్స్ సమయంలో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది పెద్ద ప్రశ్న. భయపెడుతున్న వాయుకాలుష్యానికి ఎలాంటి పరిష్కారాలు అనే్వషిస్తారన్నదీ ప్రశ్నార్థకమే. వీటికితోడు ఇండోనేసియాను భద్రతా సమస్యలు వెంటాడుతున్నాయి. ఇండోనేసియాలోనే అతి పెద్ద రెండో పట్టణం సరభయలో ఇటీవల ఇస్లామిక్ దాడులు చోటుచేసుకోవడం తెలిసిందే. ఉగ్రదాడుల్లో 15మంది ప్రాణాలు బలైపోయాయి. క్రీడలు నిర్వహించే జకర్తా, పాలెంబాంగ్, వెస్ట్ జావా ప్రాంతాల్లో లక్షమంది వరకూ భద్రతా బలగాలను మోహరిస్తున్నా, ఇంకెలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా? అన్న ఆందోళన నిర్వాహకుల్లో కనిపిస్తోంది. ‘్భద్రతకు సంబంధించి గట్టి చర్యలే చేపట్టాం. క్రీడాకారుల భద్రతకే కాదు, గేమ్స్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని జాతీయ డిప్యూటీ పోలీస్ చీఫ్ సైఫుద్దీన్ చెబుతున్నాడు. ఇంత జరుగుతున్నా జకర్తావాసులు మాత్రం ‘ఆసియా గేమ్సా? అంటే ఏమిటి? ఎప్పుడు నిర్వహిస్తారు?’ లాంటి ప్రశ్నలవద్దే ఉండటం గమనార్హం.