క్రీడాభూమి

జూనియర్ల జయపరంపర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంట్వెర్ప్(బెల్జియం), జూలై 18: భారత జూనియర్ మహిళా హాకీ జట్టు జయపరంపర కొనసాగిస్తోంది. బెల్జియంలో జరుగుతోన్న అండర్ -23 ఆరు దేశాల హాకీ టోర్నీలో బుధవారం ప్రత్యర్థి బెల్జియం జట్టుపై 2-0 గోల్స్ సాధించి వరుసగా మూడో విజయం నమోదు చేసింది. భారత జట్టులో సంగీత కుమారి 36వ నిమిషంలో తొలి గోల్ సాధిస్తే, 42వ నిమిషంలో సలీమ తేటే మరో గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలబెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 4-1తో బోణీకొట్టిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌ను 1-0తో మట్టి కరిపించింది. నాలుగో మ్యాచ్‌లో భాగంగా గురువారం కెనడాతో తలపడనుంది.
పురుషుల మ్యాచ్ డ్రా
అండర్-23 ఐదు దేశాల బాలుర హాకీ టోర్నీలో భారత్- బెల్జియం జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 5-0తో బోణీకొట్టిన పురుషుల జట్టు, మలి మ్యాచ్‌లో 1-3 తేడాతో బ్రిటన్ చేతిలో ఓటమికి గురైంది. బుధవారం బెల్జియం- భారత్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ప్రథమార్థం చివరిలో మహ్మద్ ఉమర్ గోల్ సాధించటంతో భారత్ ఆధిక్యంలో నిలబడింది. వెంటనే బెల్జియం ఆటగాడు సీరిల్ ఫ్రైంగ్ గోల్ సాధించి మ్యాచ్‌ను డ్రా చేశాడు.