క్రీడాభూమి

చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సింధు, ప్రణయ్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంగ్జూ (చైనా), ఏప్రిల్ 22: చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సూపర్ సిరీస్ నుంచి భారత స్టార్లు పివి సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో పోర్న్‌టిప్ బురానప్రసెర్‌సుక్‌తో తలపడిన సింధు 17-21, 19-21 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. రెండు సెట్లలోనూ సింధు చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్‌కి ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చెన్ లాంగ్ ఎదురయ్యాడు. దాదాపు అసాధ్యంగా కనిపించే విజయాన్ని అందుకోవడానికి ప్రణయ్ కొంత వరకూ కృషి చేసినప్పటికీ, చివరికి 10-21, 15-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ కూడా వెనుదిరిగింది. లవో ఇంగ్, లవో యూ జోడీ 21-11, 21-14 స్కోరుతో జ్వాల, అశ్వినీ జోడీపై గెలిచింది. అన్ని విభాగాల్లోనూ వైఫల్యాలు కొనసాగిన నేపథ్యంలో ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది.