క్రీడాభూమి

స్వర్ణానికి గురిపెట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 18: ఇండోనేసియాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు ఎనిమిదో స్వర్ణ పతకం సాధించడం ఖాయమని జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా గేమ్స్‌లో ఇరాన్, పాకిస్తాన్ జట్లనుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉండొచ్చని అన్నాడు. ‘ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ పురుషుల, మహిళా జట్లు 8, 3వ స్వర్ణ పతకాలు సాధించడం ఖాయం’ అన్నాడు. ‘మనవాళ్లు స్థిరమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంత వత్తిడినైనా అధిగమించి ఆట సాగించగల సమర్థులు. కబడ్డీ మాస్టర్స్ దుబాయ్ 2018లో ఘన విజయం ఆటపై మరింత స్పిరిట్ పెంచింది. ఆసియా గేమ్స్‌లో ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, కొరియా జట్లనుంచి బలమైన పోటీ ఎదురుకావొచ్చు. ఇప్పుడు మా లక్ష్యమంతా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడంపైనే’ అని అజయ్ ఠాకూర్ వెల్లడించాడు.