క్రీడాభూమి

పంత్‌కు చోటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్: ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడబోయే తొలి మూడు టెస్ట్‌ల మ్యాచ్‌ల జట్టులో కుర్ర వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు చోటుదక్కింది. అదే సమయంలో ఫైవ్ డే ఫార్మాట్‌కు సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను దూరంపెట్టారు. అంతా ఊహించినట్టే ఇంగ్లాండ్‌తో ఆడబోయే ఐదు టెస్ట్‌ల సిరీస్ జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. మొదటి మూడు టెస్ట్‌ల్లో ఆడబోయే 18మంది సభ్యుల జట్టును మాత్రమే బుధవారం ప్రకటించింది. అదేవిధంగా జట్టులో భారీ మార్పులకు అవకాశం ఇవ్వకుండా, చిన్న చిన్న సర్దుబాట్లుతోనే టెస్ట్ జట్టును సిద్ధం చేయడం గమనార్హం. అటు దేశవాళీ రికార్డులు, ఇటు ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ చూపించిన 20ఏళ్ల రిషబ్ పంత్‌కు జట్టులో చోటిచ్చారు. ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన వర్థమాన్ సాహా స్థానంలో ఆడిన రిషబ్, ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ సరసన కొనసాగుతాడు. మొన్నటి ఐపీఎల్ సమయంలో బొటన వేలికి గాయమై విశ్రాంతి తీసుకుంటున్న సాహా ఇంకొంతకాలం విశ్రాంతిలోనే ఉంటాడు. ఇక యోయో టెస్ట్‌లో విఫలమైన కారణంగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పేసర్ మహ్మద్ షమికి తిరిగి టెస్ట్ జట్టులో చోటిచ్చారు. అయితే పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో చోటుందా? లేదా? అన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. వెన్ను నొప్పి కారణంగా ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వనే్డకు భువీ దూరమైన విషయం తెలిసిందే. ‘్భవీ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ మెడికల్ బృందం సమీక్షిస్తుంది. జట్టులోకి తీసుకోవాలా? లేదా? అన్నది వాళ్ల నివేదికను బట్టే ఉంటుంది’ అంటూ బీసీసీఐ బుధవారంనాటి ప్రకటనలో పేర్కొంది. వనే్డ సిరీస్ టైంలో ఫిట్‌నెస్‌లో విఫలమైన పేసర్ జస్ప్రీట్ బుమ్రా, రెండో టెస్ట్‌నుంచి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది. ఎలా చూసినా ఇంగ్లాండ్‌తో ఆడబోయే టెస్ట్ మ్యాచ్‌ల జట్టులో రిషబ్ పంత్ ఒక్కటే కొత్త ముఖం. టెస్ట్ జట్టుకు సంబంధించి స్పిన్ విభాగంలో మార్పులు ఉండొచ్చేమో అంటూ వనే్డ సిరీస్‌కు ముందే స్కిప్పర్ విరాట్ కోహ్లీ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమేరకే బుధవారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో చిన్నపాటి మార్పులు కనిపించాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20, వనే్డ సిరీస్‌ల్లో రాణించిన రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌కు అంతా ఊహించినట్టే టెస్ట్ జట్టులో చోటుదక్కింది. షమి, బుమ్రా, శార్దూల్ సహా పేసర్ల విభాగంలోకి ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లు వచ్చి చేరారు. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మను దూరం పెట్టడం వినా చెప్పుకోతగ్గ మార్పులేమీ లేవు. ఇదిలావుంటే, దక్షిణ ఆఫ్రియా ఏ జట్టుతో బెల్గాంలో జూలై 30న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడబోయే బోర్డు ప్రసిడెంట్ ఎలెవెన్ జట్టును సైతం సెలెక్టర్ల కమిటీ ప్రకటించింది. ఆ జట్టుకు వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ సారథ్యం వహిస్తాడు.
మొదటి మూడు టెస్ట్‌ల జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, ఎం విజయ్, చెతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కరున్ నాయర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్.
బీపీ ఎలెవెన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆర్‌ఆర్ సంజయ్, ఎఆర్ ఈశ్వరన్, ధృవ్ షొరే, అన్మోల్‌ప్రీత్ సింగ్, రికీ భుయ్, జలజ్ సక్సెనా, సిద్దేష్ లాడ్, మిహిర్ హిర్వానీ, డిఏ జడేజా, అవేష్ ఖాన్, శివమ్ మావి, ఇషాన్ పోరెల్, అతీత్ సేథ్.