క్రీడాభూమి

ప్రమాణాలు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: కేంద్ర కేబినెట్ తాజా ప్రతిపాదనలను భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) తిప్పికొట్టింది. కొన్ని ప్రత్యేక క్రీడలకు సంబంధించి ఎంపిక నిబంధనలను సరళీకరించటం సాధ్యం కాదని తెగేసి చెప్పింది. ఏదైనా క్రీడకు సంబంధించి అథెట్లు/ జట్లు ఒలింపిక్ నిబంధనల మేరకు అర్హత సాధించకున్నా, ఎంపికకు సంబంధించి పతకాలు సాధించగలిగే సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలన్న క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లలేమంటూ భారత ఒలింపిక్ సమాఖ్య స్పష్టం చేసింది. సరళీకృత ప్రతిపాదనతో గత 18న క్రీడా మంత్రిత్వ శాఖ రాసిన లేఖను ఐఓఏ కోర్ కమిటీ, లీగల్ కమిటీలు శుక్రవారం సమీక్షించాయి. కేబినెట్ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించిన అనంతరం ప్రస్తుతం ఐఓఏ అనుసరిస్తోన్న నిబంధనలనే కొనసాగించాలని నిర్ణయించాయి. ‘జూలై 18న క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి అందిన లేఖలో వ్యక్తిగత క్రీడలకు సంబంధించి టాప్ 6, టీంలకు సంబంధించి టాప్ 8లో లేని అథ్లెట్లు/ జట్లు -ఆసియా గేమ్స్‌లో టాప్ 4లో నిలిచే అవకాశం ఉంటే వాళ్ల ఎంపికను పునఃపరిశీలించమంటూ కోరారు. దీనిపై కోర్ కమిటీ, లీగల్ కమిటీలు విస్తృతంగా చర్చించాయి. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లలేం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. టాప్ 6/ టాప్ 8 ప్రాతిపదికన ఇప్పటికే అథ్లెట్లు/ జట్లను ఎంపిక చేసి పంపించేశాం’ అంటూ క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఓఏ చైర్మన్ నరీందర్ బాత్రా పేర్కొన్నారు. ఈ విషయంపై క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ ‘దేశంలో క్రీడలపట్ల ఆసక్తి పెంచాలని, టావ్ ఈవెంట్లలో పతకాల సంఖ్య పెంచేందుకు కేంద్రం యోచించిన మాట వాస్తవమే. అయితే, తుది నిర్ణయం మాత్రం ఐఓఏదే అవుతుంది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.