క్రీడాభూమి

శివాలెత్తి ఉతికేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వీన్స్, జూలై 20: అంతర్జాతీయ వనే్డల్లో పాక్ ఓపెనర్లు పఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌లు ఆల్‌టైం రికార్డు సాధించారు. అత్యధిక భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా జమాన్, ఇమామ్‌లు శుక్రవారం సరికొత్త రికార్డు నెలకొల్పారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో ఆడిన నాలుగో వనే్డలో పాక్ ఓపెనర్లు పరుగుల వరదే సృష్టించారు. 2006లో లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లు సనత్ జయసూర్య, ఉప్పల్ తరంగ పేరిట నమోదైన 286 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి, 304 పరుగులతో పాక్ ఓపెనర్లు సరికొత్త రికార్డు నమోదు చేశారు. అంతేకాదు, వనే్డల్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించిన పాక్ క్రికెటర్ రికార్డును జమాన్ సొంతం చేసుకున్నాడు. 1997లో సరుూద్ అన్వర్ 194 పరుగులు సాధించిన నెలకొల్పిన రికార్డును జమాన్ అధిగమించటం గమనార్హం. మరోపక్క పాక్ ఖాతాలో ఇప్పటివరకూవున్న అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సైతం జమాన్, ఇమామ్‌లు దాటేశారు. 1994లో న్యూజిలాండ్‌తో ఆడిన వనే్డలో అమీర్ సొహైల్, ఇంజమాముల్ హక్ సాధించిన 263 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి జమాన్, ఇమామ్‌లు రికార్డు నెలకొల్పారు. 2017లో పాక్‌తో ఆడిన వనే్డలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు సాధించిన అత్యధిక పరుగుల (284) భాగస్వామ్యం రికార్డు ఇప్పుడు మూడోస్థానానికి వెళ్లిపోయింది. భారత్‌కు సంబంధించి ఈ రికార్డు సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ పేరిట నమోదైవుంది. 2001లో కెన్యాతో ఆడిన వనే్డలో సచిన్, సౌరవ్‌లు 258 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.