క్రీడాభూమి

సాహాకు సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: భుజం గాయంతో బాధ పడుతున్న వృద్ధిమాన్ సాహాకు జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో మాంచెస్టర్‌లో శస్తచ్రికిత్స నిర్వహించనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ‘వృద్ధిమాన్ సాహా పోస్టెరోసుపీరియర్ లాబ్రాల్ టియర్‌తో బాధ పడుతున్నాడు. జూలై చివరివారం లేదా ఆగస్టు తొలివారంలో లండన్‌లోని మాంచెస్టర్‌లో అతని భుజానికి శస్తచ్రికిత్స నిర్వహిస్తారు. వైద్యానికి సంబంధించిన వ్యవహారం మొత్తం జాతీయ జట్టు యాజమాన్యం జీఎం (ఆపరేషన్స్) సహకారంతో జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ) చూసుకుంటుంది’ అంటూ బీసీసీఐ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు సాహాను ఎంపిక చేయకపోవడం తెలిసిందే. అయితే, టెస్ట్ జట్టు ఎంపిక సమయంలో సాహా ఫిట్‌నెస్‌ను ఎందుకు రహస్యంగా ఉంచారన్న అంశంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైతేనేం, సాహా ఫిట్‌నెస్ వ్యవహారం పజిల్‌గా మారింది.