క్రీడాభూమి

భారత్.. బంగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జకర్తాలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత షట్లర్ లక్ష్య సేన్ థాయిలాండ్‌కు చెందిన వరల్డ్ జూనియర్ చాంపియన్ కున్లవుట్ వితిద్‌శరణ్‌ను ఖంగుతినిపించి ఆసియా జూనియర్ చాంప్‌గా నిలిచాడు. 46 నిమిషాలపాటు హోరాహోరీ సాగిన ఫైనల్ పోరులో 21-19, 21-18 వరుస సెట్ల విజయంతో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ‘ఈ విజయం సంతోషంతోపాటు, నమ్మకాన్ని పెంచింది. టీం ఈవెంట్, వ్యక్తిగత ఈవెంట్‌తో సుదీర్ఘ టోర్నీ ఆడటం హ్యాపీ’ అంటూ మ్యాచ్ అనంతరం లక్ష్య వ్యాఖ్యానించాడు. గౌతమ్ ఠక్కర్ (1965), పీవీ సింధు (2011, 2012), సమీర్ వర్మ (2011, 2012) ప్రణవ్‌చోప్రా/ప్రజక్త సావంత్ (2009)లాంటి మేటి భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో రజితం, కాంస్యానికే పరిమితమైతే, లక్ష్య నేరుగా స్వర్ణాన్ని సాధించాడు. చైనాకు చెందిన ప్రపంచ రెండో సీడ్ లీ ఫిషెంగ్‌ను క్వార్టర్ట్‌లో, ఇండోనేసియాకు చెందిన నాల్గవ సీడ్ ఇక్సన్ లియోనార్డో ఇమాన్యుయెల్ రుంబేను సెమీస్‌లో మట్టికరిపించిన లక్ష్య, ఫైనల్స్‌లో ప్రపంచ జూనియర్ చాంపియన్ కున్లవుట్‌ను ఖంగుతినిపించి సంచలనం సృష్టించాడు. లక్ష్యను భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బీఏఐ) ప్రశంసలతో ముంచెత్తింది. భారత్‌కు మూడో స్వర్ణం సాధించిన ఆటగాడిగా కొనియాడింది. ఆదర్శప్రాయ ఆటతీరు ప్రదర్శించిన లక్ష్యకు 10 లక్షల నగదు రివార్డు ప్రకటించింది.
సచిన్, దీపక్‌లకు స్వర్ణాలు
ఆసియా జూనియర్ రెజ్లింగ్ ఫైనల్ బౌట్‌లో సచిన్ రాతి (74 కేజీలు) సంచలనం సృష్టించాడు. మంగోలియా రెజ్లర్ ఎర్డెనె బ్యాంబసురెన్‌ను మట్టికరిపించాడు. భుజబలంతో దీపక్ పునియా రెచ్చిపోయాడు. టర్కెమెనిస్తాన్ రెజ్లర్ అజాత్ గజ్జెయావ్‌ను కట్టడిచేశాడు. ఫలితం.. ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు ఫ్రీ స్టయిల్ పోరులో భారత్ రెండు స్వర్ణాలు సొంతం చేసుకుంది. టోర్నీ చివరి రోజున ఐదుగురు భారత రెజ్లర్లలో నలుగురు పతకాలు సాధించారు. సూరజ్ రాజ్‌కుమార్ కోకటె (61 కేజీలు), మోహిత్ (125 కేజీలు) కాంస్య పతకాలు సాధిస్తే, సోమ్‌వీర్ (92 కేజీలు) ఒక్కడే పతకాన్ని ఒడిసిపట్టలేకపోయాడు. టీం చాంపియన్‌షిప్‌లో 173 పాయింట్లతో భారత్ ద్వితీయస్థానంలో నిలిస్తే, 189 పాయింట్లతో ఇరాన్ ప్రథమస్థానాన్ని నిలుపుకుంది. ‘నేనే గెలుస్తానని తెలుసు. చివరి క్షణం వరకూ పోరాడుతుండాలన్న కోచ్ మాటలు నన్ను ప్రభావితం చేశాయి’ అని మ్యాచ్ అనంతరం సచిన్ రాతి ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయం నాకు సులువైనదే. సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అనుభవం ఇక్కడ పనికొస్తుందని తెలుసు’ అంటూ మ్యాచ్ అనంతరం దీపక్ పునియా వ్యాఖ్యానించాడు.

చిత్రాలు..లక్ష్య సేన్
*సచిన్ రాతి స్వర్ణానందం
*భారత రెజ్లర్ మోహిత్ వీరోచిత బౌట్