క్రీడాభూమి

భారత్ ధనాధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్జింగ్ (చైనా), జూలై 30: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీలో ఆరంభంలోనే అకుంఠిత పోరుసలిపిన భారత షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం పలికారు. న్యూజిలాండ్ షట్లర్ అభినవ్ మనోటా, ఫ్రాన్స్ క్వాలిఫయర్ లూకాస్ కార్వీలను స్ట్రెయిట్ గేమ్‌లో మట్టికరిపించి ప్రఖ్యాత టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలుత వరల్డ్ నెంబర్ 11 ఆటగాడు, ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజితం సాధించిన ప్రణయ్ ప్రత్యర్థి అభినవ్ మనోటాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-12, 21-11 సెట్లతో 28 నిమిషాల్లో గేమ్‌లో విజయం సాధించాడు. ప్రణయ్ రెండో రౌండ్‌లో బ్రెజిల్ ఆటగాడు యోగోర్ కోయెల్హోతో తలపడనున్నాడు. స్విస్ ఓపెన్ చాంపియన్ సమీర్ వర్మ సైతం భారత్ విజయారంభాన్ని కొనసాగించాడు. ఫ్రాన్స్ షట్లర్ లుకాస్ కార్వీపై 21-13, 21-10 స్కోరుతో విజయాన్ని నమోదు చేశాడు. రెండో రౌండ్‌లో రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ విజేత, చైనా సీడ్ లిన్ డాన్‌ను సమీర్ వర్మ ఎదుర్కొంటాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో కామనె్వల్త్ గేమ్స్‌లో అత్యద్భుత ప్రతిభ కనబర్చిన భారత ద్వయం సాత్విక్‌సైరాజ్ రాంకీరెడ్డి, అశ్వినీ పొన్నప్పలు డెన్మార్క్‌కు చెందిన నిక్లాస్ నోర్, సారా త్యంగీసెన్‌లపై 21-9, 21-20స్కోరుతో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ప్రపంచ 39వ ర్యాంకులోవున్న ఈ భారత ద్వయం రెండో రౌండ్‌లో 15వ సీడ్ జర్మనీ మిక్స్‌డ్ డబుల్స్ మార్క్ లామ్స్‌ఫస్, ఇస్బెల్ హెట్ట్రిక్‌లతో తలపడతారు. భారత్‌కు చెందిన టాప్ మిక్స్‌డ్ డబుల్స్, 22వ ర్యాంకర్లు ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్ సిక్కిరెడ్డి ద్వయం చెక్ రిపబ్లిక్‌కు చెందిన జకుబ్ బిట్మన్, అల్జ్‌బెట బసోవా ద్వయాన్ని 21-17, 21-15 స్కోరుతో మట్టి కరిపించి రెండో రౌండ్‌కు చేరారు. ఈ రౌండ్‌లో ఇండోనేసియాకు చెందిన హఫీజ్ ఫైజల్, గ్లోరియా ఎమ్మాన్యుల్లా విడ్జాజా ద్వయాన్ని ఎదుర్కొంటారు. పురుషుల డబుల్స్‌లో ఇటీవలే లాగోస్ అంతర్జాతీయ టోర్నీలో విజయం సాధించిన భారత ద్వయం మను అత్రి, బి సుమీత్ రెడ్డిలు బల్గేరియా ద్వయం డానియెల్ నికోలావ్, ఐవాన్ రుసెవ్‌లపై విజయం సాధించారు. 21-13, 21-18 స్కోరుతో విజయం సాధించిన అత్రి, సుమీత్‌ల ద్వయం రెండో రౌండ్‌కు చేరుకుంది. యువ భారత మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇటీవలే రష్యా టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సౌరభ్ శర్మ, అనౌష్క పరీఖ్ ద్వయంతోపాటు మరో మ్యాచ్‌లో రోహన్ కఫూర్, కుహూగార్జ్‌లు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరారు. నైజీరియా ద్వయం ఎనెజో అబాహ్, పేస్ ఓర్జిలను 21-13, 21-12 సెట్లతో సౌరభ్, అనౌష్క ద్వయం ఓడిస్తే, కెనడాకు చెందిన టోబీ ఎన్జీ, రాచెల్ హాండ్రిక్‌లను 21-19, 21-6 స్కోరుతో రోహన్-కుహూ ద్వయం ఓడించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే మహిళల డబుల్స్‌లో భారత ద్వయం సంయోగితా గోర్పడె, ప్రజక్తా సావంత్‌లు టర్వీ ద్వయంపై జరిపిన పోరు ఫలించలేదు. టర్కీ షట్లర్లు బెంగీసు ఎర్సెటిన్, నజ్లికాన్ ఇన్సిలు 34 నిమిషాల పోరాటంలో 21-20, 21-14 స్కోరుతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.