క్రీడాభూమి

వి’రూట్‌కు సిరీస్ టెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూలై 31: నిజానికి ఇంగ్లాండ్‌కు తాజా టెస్ట్ చారిత్రాత్మకం. ట్రిపుల్ నైన్ రికార్డుదాటి ఫోర్ డిజిట్ టెస్ట్ రికార్డును ఘన విజయంతో లిఖించాలన్న ఉత్సాహంతో ఇంగ్లాండ్ జట్టు కనిపిస్తోంది. ఇంగ్లీష్ సంబరాలకు చెక్ పెట్టి అచ్చిరాని క్రికెట్ మక్కాలో అద్భుత గెలుపు సాధించాలన్న ప్రణాళికను టెస్ట్ టాపర్ భారత్ సిద్ధం చేస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్‌కు టెస్ట్ సిరీస్ విజయం చేకూరి దశాబ్దం దాటుతోంది. 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని జట్టు సాధించిన విజయం తరువాత, భారత్‌కు మరో గెలుపు దక్కలేదు. అలాంటి గెలుపు మరోసారి నమోదు చేయడం ప్రస్తుత కోహ్లీ సేనకు అంత సులువేం కాదు. 2011, 2014 టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టును ఎదుర్కోవడం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీవల్ల కాలేదు. 4-0, 3-1 మార్జిన్‌తో అప్పట్లో భారీ అపజయానే్న భారత్ మూటగట్టుకుంది. అప్రతిహత భారత జట్టుకు ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లు అచ్చిరాలేదన్నది రికార్డులే చెబుతున్నాయి. భారత్ 57 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే, గెలిచింది మాత్రం ఆరే. ఈ సిరీస్‌తో ఆ అపవాదు తీవ్రతను తగ్గించాలన్నది భారత్ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగని ఇంగ్లీష్ జట్టు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. కానీ, టెస్ట్ క్రికెట్ అంటే ప్రాణంపెట్టే ఇంగ్లాండ్ సొంతగడ్డంపై 2017 సెప్టెంబర్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో తొమ్మిది మ్యాచ్‌లు ఆడితే గెలిచింది ఒక్కటే. తాజా ఇంగ్లీష్ జట్టు పేస్ బ్యాటింగ్ లైనప్‌లో జో రూట్, జానీ బెయిర్‌స్టో, సీజనల్ ఓపెనర్ అలైస్టర్ కూక్‌మీద ఆధారపడటమే ఇందుకు కారణం.
2002లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌ను సౌరవ్ గంగూలీ టీం సొంతం చేసుకుంది. ఆ జట్టులోని ఆటగాడే ఇప్పటి టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగార్. 2007లో సిరీస్ విజయం సాధించిన ద్రవిడ్ నాయకత్వంలోని జట్టులో ఇప్పటి దినేష్ కార్తీక్ ఉన్నాడు. 2011, 2014లో ధోనీ నాయకత్వంలో ఇక్కడ ఆడిన టెస్ట్ సిరీస్ జట్టులో ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ ఉన్నారు. అంతేకాదు 2014లో పర్యటించిన భారత జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుత జట్టులోనూ చోటు సంపాదించారు. ఏ కోణంలో చూసినా ప్రస్తుత టీమిండియా జట్టుకు ఇంగ్లాండ్ టూర్ కొత్తకాదు. కాకపోతే, తొలి టెస్ట్ ఆడబోతున్న ఎడ్జబాస్టన్ మైదానంలో భారత్‌కు సరైన ట్రాక్ రికార్డు లేదు. 1967నుంచీ ఈ మైదానంలో ఆరు టెస్ట్‌లు ఆడితే ఐదింట్లో ఓటమే ఎదురైంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత్ తుది జట్టుకు సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోడవమే కాదు, దక్షిణ ఆఫ్రికా టూర్‌లో చేసిన పొరబాట్లను సవరించుకుంటేనే విజయావకాశాలు మెరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా టూర్‌లో అజింక్యా రహానే స్థానంలో ఫాంలోవున్న రోహిత్ శర్మను టీం మేనేజ్‌మెంట్ దింపింది. ఇప్పుడూ ఫాంలోవున్న కెఎల్ రాహుల్ ఆ స్థానం కోసం పోటీపడుతున్నాడు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీలు థర్డ్ చాయిస్ ఓపెనర్‌గా కెఎల్ రాహుల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం ఎసెక్స్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 58, రెండో ఇన్నింగ్స్‌లో 64 బంతులకు 36 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. దీనికి భిన్నంగా పేస్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ రెండు ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని రెండు డకౌట్లు సాధించాడు. ఇక చతేశ్వర్ పూజారా ఇటీవలి ఫాంపైనా సందేహాలు ముసురుతున్నాయి. అయినా గుడ్డిగా చతేశ్వర్ పూజారాను టీం మేనేజ్‌మెంట్ వెనకేసుకొస్తోంది. ఒకవేళ ఓపెనింగ్ కాంబినేషన్‌లో ధావన్ -విజయ్‌లను కొనసాగిస్తే, థర్డ్ పొజిషన్‌లో రాహుల్‌ను దింపడం శ్రేయస్కరం. బౌలింగ్‌లో భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఆర్ అశ్విన్, ఇషాంత్ శర్మలకు ఇక్కడ కౌంటీలు ఆడిన అనుభవం ఉన్నవాళ్లే. ఇంగ్లీష్ పేస్ బ్యాట్స్‌మన్లను భారత బౌలర్లు సమర్థంగా నియంత్రించగలిగితే గెలుపుదారి దగ్గరైనట్టే. తొలి టెస్ట్‌లో అశ్విన్‌తోపాటు ఎక్కువ మంది స్పిన్నర్లను రంగంలోకి దించాలన్నది టీమిండియా స్ట్రాటజీ ఇప్పుడు మారొచ్చు. ఎందుకంటే, భగభగమండిన బర్మింగ్‌హామ్ వాతావరణం ఇప్పుడు చల్లబడింది. శనివారం నుంచీ భారీగానే వర్షాలుపడ్డాయి. సోమవారం వరకూ కూడా అవుట్‌ఫీల్డ్ తేమతోనే ఉంది. నేడు మ్యాచ్ ఆరభమయ్యే సమయానికి మైదానం పొడిగా మారొచ్చు. అలాగే పిచ్ ఉపరితలం పొడిగానే కనిపిస్తున్నా, కిందిలేయర్‌లోని తేమ ప్రభావంతో బంతి స్వింగ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో, అనుభవజ్ఞుడైన అశ్విన్‌తోపాటు మరో స్పీడ్ స్టార్‌ని రంగంలోకి దించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కుల్దీప్, జడేజాలు థర్డ్ పొజిషన్‌లోకి వెళ్తారు. వికెట్ మ్యాచ్ స్ట్రిప్‌కు సమీపంలో సోమవారం టీమిండియా ప్రాక్టీస్ చేసినపుడు పేసర్లు హార్దిక్ పాండ్యా, అశ్విన్‌లే ఎక్కువ బంతులు వేశారు. అదే స్ట్రాటజీ కొనసాగించొచ్చు. కాకపోతే టీ-20, వనే్డ సిరీస్‌ల్లో ఆడిన ఇంగ్లీష్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్‌లో మార్పులు చోటుచేసుకుంటే అనూహ్యంగా స్పిన్నర్‌కు అవకాశం కల్పించినా కల్పించొచ్చు.

టీమిండియా జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), అలస్టైర్ కూక్, కియోటర్ జెన్నింగ్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, డేవిడ్ మిలాన్, మొరుూన్ ఆలి, ఆదిల్ రషీద్, జామీ పోర్టర్, శామ్ కుర్రాన్, జేమ్స్ ఆండర్సన్, స్టార్ట్ బ్రాడ్.