క్రీడాభూమి

ప్రీ క్వార్టర్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్జింగ్ (చైనా): ప్రఖ్యాత బిడబ్యుఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీధర్‌లు ప్రత్యర్థులపై సునాయాస విజయాలతో మలి అంకంలోకి అడుగుపెట్టారు. గత టోర్నీల్లో రజితం, కాంస్య పతకాలు సాధించిన సైనా మంగళవారం రెండో రౌండ్‌లో టర్కీకి చెందిన ప్రత్యర్థి అలియె డెమిర్బాగ్‌పై 21-17, 21-8 స్కోరుతో సునాయాస విజయం సాధించింది. ప్రీ క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన 2013 చాంపియన్ రాట్చనాక్ ఇంతనాన్‌ను ఎదుర్కోనుంది. ఒలింపిక్ పతక విజేత సైనా బైతో తొలి రౌండ్ అధిగమించి రెండో రౌండ్‌కు చేరడం తెలిసిందే. ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ ఐర్లాండ్‌కు చెందిన నాట్ గ్యుయెన్‌పై 21-15, 21-16తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గత సీజన్‌లో నాలుగు టైటిళ్లు సొంతం చేసుకున్న శ్రీకాంత్, తరువాతి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో ఆబియన్‌ను ఎదుర్కొంటాడు. ‘నేను ఫిట్‌గా ఉన్నా. గేమ్‌లోకి దిగాక భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో, ఫలితం ఎలా ఉంటుందన్నదాన్ని ఆలోచించడం లేదు. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడటానికి ప్రయత్నిస్తున్నా. బుధవారం పాబ్లోను ఎదుర్కోబోతున్నా. టఫ్ మ్యాచ్‌లో సరైన ప్రదర్శన ఇస్తాననే అనుకుంటున్నా’ అని మ్యాచ్ అనంతరం శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టిన మరో భారత షట్లర్ బి సాయిప్రణీత్ స్పెయిన్‌కే చెందిన లురుూస్ ఎన్‌రిక్యూ పెనాల్వెర్‌ను ఎదుర్కొంటాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, అశ్వినీ పొన్నప్ప జోడీ జర్మనీకి చెందిన మార్క్ లామ్స్‌ఫస్, ఇసాబెల్ హెర్‌ట్రిక్‌ల జోడీపై 10-21, 21-17, 21-18 విజయంతో ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ జంట ఏడో సీడ్ మలేసియన్ జోడీ గోహ్ సూన్ హాట్, షెవోన్ జెమీలాయ్ జోడీని ఎదుర్కొంటుంది. ‘ఎందుకో తెలీదుగానీ ఈరోజు సర్వీస్ తప్పులు చేశామన్న మాట నిజం. అలాగని కాన్ఫిడెన్స్ తగ్గలేదు. కామనె్వల్త్ గేమ్స్‌లో మమ్మల్ని ఓడించిన జంటను రేపు ఎదుర్కోబోతున్నాం. మ్యాచ్‌లో విజయం సాధించాలన్న కసితో ఉన్నాం’ అని మ్యాచ్ అనంతరం అశ్విని వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప/ ఎన్ సిక్కిరెడ్డి ద్వయం, మేఘనా జక్కంపూడి/ పూర్విషా ఎస్ రామ్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కఫూర్/ కుహూ గార్గ్ జోడీలు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాయి. పురుషుల డబుల్స్‌లో అర్జున్ ఎంఆర్/ రామచంద్రన్ శ్లోక్‌లు సైతం ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో టాప్ జోడీ ప్రణవ్ జెర్రీ చోప్రా/ ఎన్ సిక్కిరెడ్డి జోడీ సైతం ఇండోనేసియన్ జోడీపై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. హాంకాంగ్ షట్లర్ల ముందు నిలవలేకపోయిన తరుణ్ కోన/ సౌరభ్ శర్మ ద్వయం సైతం ఓటమితో టోర్నీనుంచి నిష్క్రమించారు.