క్రీడాభూమి

భారత్.. బౌన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 1: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనే భారత్ ఆశలు పెంచేసింది. ఇన్నింగ్స్ తొలి రోజే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. స్పిన్నర్లకు పిచ్ అనుకూలమన్న అంచనాలను ఖాయం చేస్తూ అశ్విన్ మ్యాచ్‌ను మెలితిప్పాడు. అశ్విన్‌కు సహకరిస్తూ షమి సైతం ఇంగ్లాండ్‌ను కట్టడిచేశాడు. భారత బౌలర్ల ధాటికి తలొగ్గి నిలకడగా ఆట ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు, తొలిరోజు గేమ్ ముగిసే సరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు సాధించింది. భారత్‌తో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి సెషన్‌లో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చిన జో జట్టు, 36 ఓవర్లలో వంద పరుగులు సాధించింది. భోజన విరామం అనంతరం కూడా మ్యాచ్ నిలకడగానే సాగుతుందనుకున్న అంచనాలను భారత బౌలర్లు తలకిందులు చేశారు. తొలి సెషన్‌లో ఇంగ్లీష్ పేసర్ అలిస్టర్ కుక్ (13: 28 బంతుల్లో- 2్ఫర్లు)ను పెవిలియన్‌కు పంపిన అశ్విన్ సెకెండ్ సెషన్‌లో చెలరేగిపోయాడు. మ్యాచ్ మొత్తంలో 25 ఓవర్ల వేసి (ఏడు మేడిన్లు) 60 పరుగులిచ్చి బెన్ స్టోక్స్ (21: 41బంతుల్లో, 2్ఫర్లు), బట్లర్ (0: 2బంతులు), స్టువార్ట్ బ్రాడ్ (1: 7బంతుల్లో) వికెట్లను పడగొట్టాడు. దీంతో గేమ్ మొత్తం భారత్ నియంత్రణలోకి వచ్చినట్టయ్యింది. అశ్విన్‌కు సహకరిస్తూ పేసర్ షమి (19 ఓవర్లలో రెండు మేడిన్, 64 పరుగులిచ్చి 2 వికెట్లు) సైతం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను నియంత్రించాడు. ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో 17 ఓవర్లు వేసి చెరో వికెట్ తీసుకున్నారు. వరుస వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ చివరకు కష్టాల్లో పడింది. టెస్ట్ క్రికెట్‌లో 41వ అర్థ సెంచరీ నమోదు చేసిన రూట్ (80: 156 బంతుల్లో 9 ఫోర్లు) సెంచరీకి చేరకుండానే కోహ్లీ చేతిలో రనౌట్‌గా వెనుతిరిగాడు. అయితే టెస్ట్ క్రికెట్‌లో వేగవంతంగా 6వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రూట్ తన పేరు నిలుపుకున్నాడు. ఇదే రికార్డును ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టైర్ కూక్ ఐదేళ్ల 339 రోజుల్లో సాధిస్తే, రూట్ ఐదేళ్ల 231 రోజుల్లో సాధించడం గమనార్హం.
అంతకుముందు సెకెండ్ సెషన్ టీ బ్రేక్ తరువాత మూడు వికెట్ల నష్టంతో 161 పరుగుల వద్ద నిలిచిన ఇంగ్లాండ్ మహ్మద్ షమికి దొరికిపోయింది. రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిపై వత్తిడితెచ్చినా, ఇంగ్లాండ్ స్కిప్పర్ జో రూట్ మాత్రం తొట్రు పడకుండా తన పంథా కొనసాగించాడు. జానీ బెయిర్‌స్టో అతనికి సహకరించాడు. జెన్నింగ్స్ ఏకాగ్రతను పిచ్ వద్దకొచ్చిన పావురం దెబ్బతీయడం భారత్‌కు కలిసొచ్చిన విషయం. షమి వేసిన తరువాతి బంతిలోనే జెన్నింగ్స్ పెవిలియన్ బాటపట్టాడు. తరువాత ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ సమర్థవంతమైన బంతులతో ఇంగ్లీష్ జట్టును కట్టడి చేశారు. షమి, పాండ్యాలకు కొంచెం ముందుగా అశ్విన్‌ను ఏడో ఓవర్‌లో దింపి కెప్టెన్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపర్చడం కనిపించింది. అయితే దాని ఫలితం ఆటలో కనిపించింది. అశ్విన్ రెండో ఓవర్‌లోనే కూక్ వికెట్ కుప్పకూలడం భారత్‌కు బ్రేక్‌త్రూ అయ్యింది. టెస్ట్ క్రికెట్‌లో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ కూక్‌ను అశ్విన్ పడగొట్టడం ఇది ఎనిమిదోసారి. నిన్నటి పేర్లనే తుది జట్టుగా ఇంగ్లాండ్ ప్రకటిస్తే, భారత్ తుది జట్టులో మాత్రం మార్పులు తీసుకొచ్చి విరాట్ విస్మయపర్చాడు. ఛతేశ్వర్ పూజారాను తప్పించి శిఖర్ ధావన్‌కు అవకాశమిస్తే, బ్యాటింగ్ లైనప్‌లో కెఎల్ రాహుల్‌కు మూడోస్థానం కల్పించాడు. తుది జట్టులో భారత్ సైతం ముగ్గురు పేసర్ల సరసన ఒక్క స్పిన్నర్‌నే బరిలోకి దింపింది.