క్రీడాభూమి

అథ్లెట్ నవీన్ దాగర్‌పై సస్పెన్షన్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధమవుతున్న భారత అథ్లెట్ నవీన్ దాగర్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. గౌహతిలో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో ఈ రన్నర్ నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) గత నెల 23న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు రుజువు కావడంతో అతనిపై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సస్పెన్షన్ వేటు వేసింది.
అయితే, నవీన్‌కు త్వరలో ‘బి’ శాంపుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. నవీన్ దాగర్ 2014 ఇన్‌చియాన్ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. అథ్లెటిక్స్ ఫెడరేషన్‌లో ఇటీవల కాలంలో డోపింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లెట్లు పట్టుబడ్డారు. ఇంతకుముందు జావెలిన్ త్రోయర్ అమిత్ కుమార్ (ఇంటర్ స్టేట్ మీట్‌లో కాంస్య పతక విజేత) డోపిగ్ టెస్టుల్లో పట్టుబడ్డాడు.
ఇపుడు తాజాగా నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి సస్పెన్షన్‌కు గురికావడంతో ఈనెల 18 నుంచి జకార్తా, పాలెంబంగ్‌లో జరిగే 3వేల మీటర్ల పరుగు పందెం పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం లేనట్టే.