క్రీడాభూమి

తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 2: ఇంగ్లాండ్-్భరత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిధ్య జట్టుకు 13 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృధా అయ్యింది. మ్యాచ్ తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆతిధ్య జట్టు 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. జో రూట్ 80, బెయిర్ స్టో 70, జెన్నింగ్స్ 42 పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు సాధించలేకపోయారు. తొలిరోజు మ్యాచ్‌లో భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4, మహమ్మద్ షమీ 3, ఉమేష్‌యాదవ్, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. రెండోరోజు గురువారం మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోవడంతో జట్టు 287 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన 287 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలో 10 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తర్వాత ఆతిధ్య జట్టు ఎడమచేతివాటం బౌలర్ శాం కుర్రన్ టీమిండియాను దెబ్బతీశాడు. మూడు ప్రధాన వికెట్లు (మురళీ విజయ్, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్)ను పడగొట్టి ఒత్తిడికి గురిచేశాడు. దీంతో కేవలం 16 ఓవర్లలోనే టీమిండియా 59 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. లంచ్ విరామ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మురళీ విజయ్ 45 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 20 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 46 బంతులు ఎదుర్కొన్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మూడు బౌండరీలతో 26 పరుగులు చేసి శాం కుర్రన్ బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. లోకేష్ రాహుల్ కేవలం రెండు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అజింక్య రహానే 34 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 15 పరుగులు చేశాడు. ఇతనిని బెన్ స్టోక్ బౌలింగ్‌లో జెన్నింగ్స్ ఔట్ చేశాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా ప్రారంభించకుండానే బెన్ స్టోక్స్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కలసి పరుగులు పెట్టిస్తున్న తరుణంలో హార్దిక్ పాండ్య ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 52 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య మూడు బౌండరీలతో 22 పరుగులు చేశాడు. 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 15 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న మహమ్మద్ షమీ కేవలం రెండు పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో మలన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఇషాంత్ శర్మ ఐదు పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
తమ జట్టులో వికెట్లన్నీ టపటపా పడిపోతున్నా మొక్కవోని ఆత్మస్థయిర్యంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. కోహ్లీ 225 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 22 ఫోర్లతో 149 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 16 బంతులు ఎదుర్కొన్న ఉమేష్ యాదవ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో శాం కుర్రన్ నాలుగు, జేమ్స్ ఆండర్సన్, ఆదల్ రషీద్, బెన్ స్టోక్స్ రెండేసి వికెట్లు సాధించారు.