క్రీడాభూమి

వాడే విరాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఒకే ఒక్కడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై శతకం సాధించిన వీరుడు. జట్టు ఓడితేనేమి వాడొక్కడు గెలిచాడు. ఇప్పుడు సరికొత్త విరాట్ పర్వానికి తెరలేపాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో టాపర్ కోహ్లీ. 32 నెలలపాటు ఈ స్టేటస్‌లోవున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రికార్డుకు ఆదివారంతో బ్రేక్‌పడింది. నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్ అనిపించుకున్న భారత ఆటగాళ్లలో కోహ్లీ ఏడోవాడు. 2011లో సచిన్ ఈ స్టేటస్ సాధించిన తరువాత, ఇప్పుడు కోహ్లీకే ఆ రికార్డు దక్కింది. గతంలో రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, వీరేందర్ సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లు నెం 1 టెస్ట్ బ్యాట్స్‌మెన్ అనిపించుకున్నవాళ్లే. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్ట్‌లో భారత జట్టు ఓటమి చవిచూసినా రెండు ఇన్నింగ్స్‌లో (149, 51) పరాక్రమ పరుగులు సాధించిన కోహ్లీ మాత్రం విజేతగా నిలిచాడు. 2015 డిసెంబర్ నుంచీ నెం1 టెస్ట్ బ్యాట్స్‌మెన్ హోదాలోవున్న స్మిత్ (929)ను ఐదు పాయింట్లు అధిగమించి నెం1 ర్యాంకుకు చేరడం కోహ్లీ (934 పాయింట్లు)కి ఇది తొలిసారి. ఇంగ్లాండ్‌తో భారత్ ఆడనున్న మరో నాలుగు టెస్ట్‌ల్లో సాధించే పరుగులతో కోహ్లీ ఎవరూ అందుకోలేని ఆధిక్యానికి చేరతాడన్న అంచనాలు లేకపోలేదు. తొలి టెస్ట్ ఆడిన ఎడ్జ్‌బాస్టన్ మైదానంలోకి 903 పాయింట్లతో దిగిన కోహ్లీ, అప్పటికి గవాస్కర్ కంటే 13 పాయింట్లు దిగువనే ఉన్నాడు. లార్డ్స్‌లో జరగనున్న మలి టెస్ట్‌లో కోహ్లీ కనుక చెలరేగితే, అత్యధిక పాయింట్లు సాధించిన టాప్ 10 క్రికెటర్ల జాబితాలో మార్పులు తప్పదు. ఈ జాబితాలో 935 పాయింట్లతో కొనసాగుతున్న మాథ్యూ హైడెన్, ఖల్లీస్, ఏబి డెవిల్లర్స్‌ను వెనక్కి నెట్టడం ఖాయం. ఈ జాబితాలో డొనాల్డ్ బ్రాడ్‌మన్ (961), స్టీవ్ స్మిత్ (947)లు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే వనే్డ ర్యాంకుల్లో నెం 1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న కోహ్లీ, టీ-20ల్లో మాత్రం నెం1 ర్యాంకర్ ఆస్ట్రేలియా ఆటగాడు అరోన్ ఫిన్చ్‌కు 220 పాయింట్ల దిగువన 12వ ర్యాంకర్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై తొలి టెస్ట్‌తో భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4-62, 3-59) 14 పాయింట్లు సాధించి ఒక్క పాయింట్ తేడాతో ఫోర్త్ ర్యాంకర్ దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలాండెర్ సరసకు చేరాడు. జేమ్స్ ఆండర్సన్ మాత్రం తన నెం 1 టెస్ట్ బౌలర్ ర్యాంకు నిలుపుకున్నాడు.